పార్టీ ఆదేశిస్తే విశాఖ నుండి పోటీ: మళ్లీ టిఎస్సార్ కన్ను

ఆయన మాట్లాడుతూ... పురంధేశ్వరి, తాను మంచి మిత్రులమని చెప్పారు. విశాఖ అభివృద్ధికి తాము ఇద్దరం వేర్వేరుగా కృషి చేస్తున్నామని చెప్పారు. పురంధేశ్వరిని కాంగ్రెసు పార్టీలోకి ఆహ్వానించింది తానేనని చెప్పారు. ఆమెను విశాఖ నుండి పోటీకి ఆహ్వానించింది కూడా తానేనని చెప్పారు. అధిష్టానం తర్వాతి ఎన్నికలలో విశాఖ నుండి పోటీ చేయమంటే అందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. నెల్లూరు ఉప ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని చెప్పారు.
కాగా పురంధేశ్వరికి ముందు సుబ్బి రామి రెడ్డి విశాఖ నుండి ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సామాజిక, రాజకీయ కోణాల దృష్ట్యా అధిష్టానం పురంధేశ్వరిని అక్కడి నుండి పోటీ చేయించింది. అయితే ఇటీవల జరిగిన ఉప ఎన్నికలకు ముందు ఆయన పలుమార్లు తాను వచ్చేసారి విశాఖ నుండే పోటీ చేస్తానని, పురంధేశ్వరికి మరో నియోజకవర్గం ఉందని పలుమార్లు చెప్పారు.
ఆయన వ్యాఖ్యలపై పురంధేశ్వరి ఎప్పుడూ స్పందించలేదు. అధిష్టానం నిర్ణయాన్ని బట్టి ఉంటుందని చెప్పారు. ఇటీవల ఉప ఎన్నికలలో అధిష్టానం టిఎస్సార్‌ను నెల్లూరు నుండి ఎంపి పోటీకి బరిలో నిలిపింది. దీంతో ఆయన విశాఖ నుండి నెల్లూరుకు బదిలీ అయినట్లేనని, ఆయన దృష్టి ఇప్పుడు ఇటు ఉంటుందని భావించారు. కానీ తాజాగా ఆయన అధిష్టానం ఆదేశిస్తే విశాఖ నుండి పోటీ చేసేందుకు సిద్ధమని చెప్పడం ద్వారా అక్కడి నుండి పోటీ చేసేందుకే ఆయన ఆసక్తి కనబరుస్తున్నట్లుగా ఉందని అంటున్నారు.












Click it and Unblock the Notifications