రామోజీ పన్ను ఎగవేశారంటూ సాయిరెడ్డి ఫిర్యాదు

Vijaya Sai Reddy-Ramoji Rao
హైదరాబాద్: ఈనాడు గ్రూపు సంస్థల అధిపతి రామోజీ రావు పన్ను ఎగవేశారంటూ జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో నిందితుడు విజయసాయి రెడ్డి ఆదాయం పన్ను శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. రామోజీ రావు వేయి కోట్ల రూపాయల మేరకు పన్ను ఎగవేశారని ఆయన ఫిర్యాదు చేశారు.

ఏ మాత్రం విలువ లేని ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ ఆస్తులకు 6,600 కోట్ల రూపాయలుగా వెల కట్టారని ఆయన ఆరోపించారు. ఉషా కిరణ్ మూవీస్, ఉషా కిరణ్ టీవీ విలువలను కూడా అధికంగా అంచనా వేశారని, పాత సినిమాలను, పాత సీరియళ్లను ప్రాతిపదికగా తీసుకుని రూ. 787 కోట్లుగా విలువ కట్టారని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో ఉన్న సంబంధం వల్ల ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 39 శాతం వాటా ఉన్నప్పటికీ రిలయన్స్ ఒక్క డైరెక్టర్‌ను కూడా పెట్టలేదని ఆయన అన్నారు.

రిలయన్స్ పెట్టుబడి విలువ రూ.2,606 కోట్ల మేరకు ఉంటుందని, అయితే అది చంద్రబాబునాయుడు, రామోజీ రావు బినామీ సొమ్ము అని ఆయన అన్నారు. ఆర్ఐఎల్ ద్వారా ఉషోదయా స్వీకరించిన 1,457 కోట్ల రూపాయల మొత్తం ఉందని, ఆ మొత్తం రామోజీరావు సాఫ్ట్‌వేర్ లైబ్రరీ కొనుగోలు కోసం అక్రమ మార్గాల్లో పొందారని ఆయన ఆరోపించారు.

పనికి రాని సరుకు కిందికి వచ్చే సాఫ్ట్‌వేర్ లైబ్రరీని రామోజీరావు 2006 - 07లో రూ. 787 కోట్ల రూపాయలకు ఉషోదయకు విక్రయించారని ఆయన అన్నారు. హైదరాబాదులోని లకిడికా పూల్ హెచ్‌డిఎఫ్‌సి శాఖలో రామోజీ రావు జమ చేసిన 303 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయం లేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+