మీకే మా ఓటు: ప్రణబ్ ముఖర్జీకి వైయస్ జగన్ హామీ!

YS Jagan-Pranab Mukherjee
హైదరాబాద్/న్యూఢిల్లీ: జూలై 19న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలలో మీకే ఓటేస్తానని యుపిఏ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ హామీ ఇచ్చారని అంటున్నారు. రాష్ట్రపతి రేసులో నిలబడిన పిఏ సంగ్మా, ప్రణబ్ దాదా ఇద్దరూ మద్దతు కోరినప్పటికీ పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని యుపిఏ అభ్యర్థి ముఖర్జీకే ఓటు వేయాలని ఆ పార్టీ నిర్ణయించుకున్నదని అంటున్నారు.

ఇదే విషయాన్ని ప్రణబ్‌కు కూడా చెప్పారని అంటున్నారు. గత గురువారం అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి కలిసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రోజే అతను ప్రణబ్ దాదాను కలిశారు. ఈ సందర్భంగా జగన్ తరఫున సబ్బం దాదాకు హామీ ఇచ్చారని అంటున్నారు.

రాష్ట్రపతి ఎన్నికలలో మీకు ఓటేస్తామని చెప్పమని జగన్ తనను పంపించారని, పార్టీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని దాదాకు సబ్బం చెప్పారని అంటున్నారు. తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండేందుకు దాదాపు నిర్ణయం తీసుకున్నాయని తెలుస్తోంది.

కాగా యుపిఏ తరఫున ప్రణబ్, ఎన్డీయే తరఫున పిఏ సంగ్మా రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఇటీవల హైదరాబాద్ వచ్చిన సంగ్మా తనకు మద్దతివ్వాల్సిందిగా ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మను కలిసి అడిగారు. అనంతరం జైలులో ఉన్న జగన్‌ను కలిసేందుకు సంగ్మా వెళ్లారు. కానీ ములాఖత్‌లు ముగియడంతో జైలు అధికారులు అనుమతివ్వలేదు. దీంతో అతను జగన్‌ను కలవకుండానే వెనుదిరిగారు. జూలై 1న వచ్చిన ప్రణబ్ కూడా విజయమ్మకు ఫోన్ చేసి మద్దతు కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+