లగడపాటి కెసిఆర్ చెప్తే కాదు: కెకె, '14లోపు తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు లేదా తాను ఇవ్వమంటేనో, విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వద్దంటేనో తెలంగాణపై నిర్ణయం ఉండదన్నారు. ప్రజల కోరిక ప్రకారం పార్టీలు, కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ప్రజల కోరిక మేరకే పార్టీలు నడుస్తాయన్నారు. ఆంధ్రాలో తెలంగాణకు వ్యతిరేకత లేదని చెప్పారు.
తెలంగాణ ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా ఉందన్నారు. మరోసారి సకల జనుల సమ్మె చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదన్నారు. ప్రాజెక్టు డిజైన్ మార్పు చేయాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అన్నారు. మార్పులతో ప్రాజెక్టు చేయవచ్చునని ఆయన ప్రభుత్వానికి సూచించారు.
కాగా కెసిఆర్ ఇటీవల ఆగస్టు, సెప్టెంబర్‌లోగా తెలంగాణ వస్తుందని చెప్పిన విషయం తెలిసిందే. అలా తనకు సంకేతాలు ఉన్నాయని ప్రకటించారు. కెసిఆర్ వ్యాఖ్యలను నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ కొట్టి పారేశారు. కెసిఆర్ చెప్పినట్లుగా ఆగస్టులో తెలంగాణ వచ్చే విధంగా ఎలాంటి సంకేతాలు లేవన్నారు.












Click it and Unblock the Notifications