సంగ్మాకు ఓటేసి, సరిదిద్దుకున్న ములాయం సింగ్

మొదటి తృణమూల్ కాంగ్రెసు పార్టీతో చేతులు కలిపి ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రపతి అభ్యర్థిగా అబ్దుల్ కలాం, మన్మోహన్ సింగ్, సోమనాథ్ ఛటర్జీల పేర్లను సూచించారు. ఆ తర్వాత 42 గంటల లోపల తన మనసు మార్చుకున్నారు. తృణమూల్ కాంగ్రెసు పార్టీ అధినేత మమతా బెనర్జీని కాదని ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వానికి మద్దతు చెప్పారు.
మరోసారి ములాయం సింగ్ గురువారం రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ సందర్భంగా పొరపాటున యుపిఎకు షాక్ ఇచ్చేలా వ్యవహరించారు. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. మరో సంఘటన బిజెపికి వ్యతిరేకంగా జరిగింది. గుజరాత్ బిజెపి శాసనసభ్యుడు కాను కలాసరియా పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి ప్రణబ్ ముఖర్జీకి ఓటేశారు. బిజెపి సంగ్మాకు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇదిలావుంటే, రాజ్ థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) శాసనసభ్యులు 12 మంది ఓటింగుకు దూరంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి చెందిన శాసనసభ్యులు చిన్నం రామకోటయ్య, బాలనాగిరెడ్డి పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటింగులో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications