రాజకీయ క్రీడే గొప్ప కానీ, వ్యాపారం కాదు: కిరణ్ రెడ్డి

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు ఏ చిన్న తప్పు చేసినా ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు హిత బోధ చేశారు. 2014లో రాష్ట్రం నుంచి కేంద్రానికి పెద్ద ఎత్తున ఎంపీలను గెలిపించి ఇస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. ఈ లక్ష్యం సాధించడంలో యువజన కాంగ్రెస్ పాత్ర చాలా పెద్దదని చెప్పారు. ప్రభుత్వంలో ఉంటాం, పోతామని, పార్టీని నమ్ముకోవాల్సిన అవసరం ఉందన్నారు.
క్రీడలన్నింటి కంటే రాజకీయ క్రీడే గొప్పదని.. ఇది వ్యక్తి ఎదుగుదలకు దోహదపడుతుందన్నారు. పదవులు వచ్చేవరకూ కష్టపడి పనిచేయాలని సూచించారు. హైదరాబాద్, ఢిల్లీల్లో ఉంటూ లాబీయింగ్ చేస్తే పదవులు వస్తాయనుకుంటే పొరపాటన్నారు. రాజకీయాలంటే వ్యాపారం కానేకాదన్నారు. తాను సామాన్య కార్యకర్తగానే పనిచేస్తానని వంశీ చంద్ రెడ్డి అన్నారు.
ఎస్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన సమయంలో తాను తెల్ల కాగితం వంటి వాడినని, పలువురు సీనియర్లు తనను రంగు కాగితాన్ని చేశారని.. ఇప్పుడు గాలి పటంలా రాజకీయ రంగంలో పైకి ఎదిగేందుకు తోడ్పాటును ఇవ్వాలని కోరారు. కాగా ఈ కార్యక్రమానికి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హాజరు కాలేదు. ఆయన ఢిల్లీలో ఉన్నారు.












Click it and Unblock the Notifications