వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పెళ్లి కాకముందే కలిసున్నారని యువజంట దారుణహత్య

రాళ్ల దెబ్బలకు ఆ మహిళ కొద్దిసేపటికే సొమ్మసిల్లగా, కొంచెం సేపు కేకలు పెట్టి ఆ యువకుడు కూడా సృహ తప్పాడని ఆయన వెల్లడించారు. ఆ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు ఆయన తెలిపారు. దేశ ఉత్తర ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న ఇస్లాం ఛాందసవాదులు మాలి తాత్కాలిక ప్రభుత్వానికి సవాలు విసురుతున్నారు.
ఆ జంట మృతదేహాలు వారి మెడ వరకు కాలి ఉన్నాయి. దుండగులు ఆ జంటను అగ్యూలోక్ నగరం మధ్యలోకి లాక్కొచ్చారని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ఈ ఘటన జరిగినప్పుడు తాను అక్కడే ఉన్నానని ఓ స్థానిక ప్రభుత్వ ఉద్యోగి చెప్పారు. వారిని రాళ్లతో కొట్టి చంపారని, ఇది చాలా భయంకరమైన చర్య అని అతను పేర్కొన్నాడు.
దాడి జరుగుతుండగా ఆ యువతి ఏడుస్తుండగా, యువకుడు అరిచాడని, ఇది మానవత్వం లేని చర్య అని, వారిని జంతువుల్లా చంపారని చెప్పాడు. వందలమంది ఉండగా వారిని చంపేశారని ఆతను చెప్పాడు.