నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇంకా వీడని మిస్టరీ: ప్రమాదంపై రహస్య విచారణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Tamilnadu express accident: Mystery continues
నెల్లూరు: తమిళనాడు ఎక్స్‌ప్రెస్ దుర్ఘటన జరిగి ఐదు రోజులు గడుస్తున్నా మిస్టరీ ఇంకా వీడలేదు. రైల్వే దర్యాప్తు బృందాలు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నా నిజానిజాలు బయటకు రావడం లేదు. అసలు ప్రమాదానికి సంబంధించి జూలై 30న ఏం జరిగిందన్నదానిపై ఎవరూ పెదవి విప్పడం లేదు. గురువారం నెల్లూరులో దక్షిణమధ్య రైల్వే డివిజన్ భద్రతాధికారి డి.కె.సింగ్, సికింద్రాబాద్ సీఎస్‌వో పి.ఎం.రామ్, డీఆర్ఎం ప్రదీప్‌కుమార్, ఏడీఆర్ఎం సుబ్బారావు నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్ అతిథి గృహంలో రహస్య విచారణ చేపట్టారు.

ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు 160 మంది అధికారులు, సిబ్బంది నుంచి వేర్వేరుగా వివరాలు సేకరించారు. విచారణ మొత్తాన్ని వీడియో తీశారు. వాంగ్మూలాలను టైప్ చేయించి సంతకాలు తీసుకున్నారు. వారి ప్రశ్నల వర్షానికి ఒకరిద్దరు టీటీఈలు జవాబివ్వలేక కంటతడి పెట్టినట్లు సమాచారం. ఎస్-11లో రిజర్వేషన్ లేకుండా ప్రయాణికులను ఎందుకు అనుమతించారు? జరిమా నా విధించారా... లేదా? తదితర ప్రశ్నలకు ఆ బోగీ టీటీఈ కమల్‌కాంత్ నీళ్లు నమిలినట్లు తెలిసింది.

విజయవాడ దాటిన తర్వాత టీటీఈలు నిద్రపోయినట్లు దర్యాప్తులో తేలింది. అలాగే షార్ట్ సర్క్యూట్‌వల్లే దుర్ఘటన జరిగిందన్న వాదనలపై దర్యాప్తు బృందం సంబంధిత రైల్వే ఎలక్ట్రిసిటీ అధికారులు, సిబ్బందిని విచారించింది. అలాంటిదేమీ జరగలేదని వారు సోదాహరణంగా చెప్పినట్లు సమాచారం. శుక్రవారం విచారణలో రైల్వే సిబ్బందితోపాటు ప్రయాణికులనూ ప్రశ్నిస్తారు.

ఇక ప్రమాదం జరిగిన ఆరు గంటల తర్వాతే రైల్వే అధికారుల్లో కదలిక వచ్చిందని, సహాయ చర్యలనూ వేగవంతం చేయలేదని జిల్లా ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు. కాగా, టీటీఈ కమల్‌కాంత్‌ను జిల్లా పోలీసు అధికారులు విచారించే అవకాశం ఇవ్వకుండా రైల్వే అధికారులు హుటాహుటిన చెన్నైకు పంపేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఘటన జరిగిన రోజు రైల్వే మంత్రి, ఇతర ఉన్నతాధికారుల ప్రొటోకాల్‌పైనే రైల్వే అధికారులు శ్రద్ధ చూపారని, క్షతగాత్రుల బాగోగులు చూడలేదని ప్రయాణికులు ఆరోపించారు. మృతదేహాలను ఫ్లాట్‌ఫాంపై వదిలి వెళ్లిపోయారు. జిల్లా వైద్యులు, కార్పొరేషన్ సిబ్బంది సహకారంతో కలెక్టర్, ఎస్పీ సహాయ చర్యల ను, మృతదేహాలను దించడాన్నీ పర్యవేక్షించారు. అలాగే రిజర్వేషన్ చార్టుకోసం సాక్షా త్తూ ఎస్పీ బి.వి.రమణకుమార్ అడిగినా ఉదయం 11 గంటల ప్రాంతంలోగానీ అందజేయలేదు. అందులోని ఫోన్ నంబర్ల ఆధారంగా బంధువులకు సమాచారం ఇచ్చారు. ప్రజాగ్రహానికి భయపడే ఆలస్యంగా వచ్చామని రైల్వే అధికారులు చెప్పడం కొసమెరుపు.

ఎస్-11 బోగీ నుంచి 65 బ్యాగుల నమూనాలను రైల్వే సేఫ్టీ, ఫోరెన్సిక్ అధికారులు సేకరించారు. వీటిలో ఎలక్ట్రానిక్, ఇతర వస్తువులు, శరీర అవయవాలు ఉన్నట్టు సమాచారం. నమూనాలు కొద్ది రోజులు ఎండిన తర్వాత ఉన్నతాధికారుల సమక్షంలో పరీక్షిస్తారు. మరోవైపు మల్కిత్‌సింగ్ (20), హరిప్రీత్‌సింగ్ (పంజాబ్), బలదేవ్‌సింగ్ (ఉత్తరాఖండ్)ల మృతదేహాలను గురువారం బంధువులు గుర్తించారు. మొత్తం 28 మృతదేహాల్లో 24 బంధువులకు అప్పగించగా మరో నాలుగు మార్చురీ ఉన్నాయి.

English summary

 According tp preliminary information - the Tamilnadu express train incident is not due to short circuit. Experts examined the batteries in S-11 coach and found the batteries are fully charged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X