హైదరాబాద్ లో ఎబోలా వైరస్ భయం.. శంషాబాద్ ఎయిర్‌ పోర్టులో హై అలర్ట్

ప్రపంచ దేశాల్ని ఎబోలా వైరస్ వణికిస్తోంది. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే ఎబోలాను అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనకరమైన పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO) ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా అన్ని అంతర్జాతీయ ఎయిర్ పోర్టుల్లో మెడికల్ టీమ్ లను మోహరిస్తోంది కేంద్ర ప్రభుత్వం. వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక ఇదే విషయంపై కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. దేశంలో ఇప్పటివరకూ ఒక్క ఎబోలా వైరస్ కేసు కూడా నమోదు కాలేదని వెల్లడించారు. వైరస్ వ్యాప్తిని నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ఇక హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్‌ పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. ఎబోలా వైరస్ నేపథ్యంలో ఎయిర్ పోర్టులో ప్రయాణికులకు థర్మల్ స్కానర్లు, హెల్త్ చెకప్ లతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. జ్వరం, వాంతులు, బలహీనత లక్షణాలు ఉన్న అనుమానితులను ఐసోలేషన్ కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఎబోలా కేసులు నమోదు కాలేదని.. ఎబోలా లక్షణాలు ఉన్న వ్యక్తులను కూడా ఇప్పటివరకు గుర్తించలేదని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు.

EbolaVirus Scare in Hyderabad High Alert Declared at Shamshabad Airport for Incoming Flights Ebola

కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలో అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపట్టినట్లు వివరించారు. ముఖ్యంగా ఆఫ్రికా ఖండంలోని దేశాలైన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, సౌత్ సూడాన్ వంటి ఎబోలా బాధిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను శంషాబాద్‌ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే స్క్రీనింగ్, థర్మల్ స్కానింగ్ చేస్తూ వారిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. విమానాశ్రయంలో డాక్టర్లు, హెల్త్ ఇన్‌స్పెక్టర్లు, ఫీల్డ్ స్టాఫ్, పారామెడికల్ సిబ్బందితో ప్రత్యేక బృందం విధులు నిర్వహిస్తోందని అన్నారు. అత్యవసర పరిస్థితుల కోసం 108 అంబులెన్స్‌‌లను 24 గంటలపాటు అందుబాటులో ఉంచుతున్నామని పేర్కొన్నారు. అలాగే గాంధీ హాస్పిటల్‌ లో 10 పడకల ప్రత్యేక ఐసోలేషన్ వార్డును ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక అనుమానితుల సాంపిల్స్ టెస్ట్ చేయడం కోసం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV), పుణేకు సాంపిల్స్ పంపించనున్నారు‌ వైద్యులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+