హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజకీమొద్దు: విజయమ్మ, నాశనం చేయాలని.. అంబటి

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Vijayamma - Ambati
హైదరాబాద్: బిసిలకు వంద సీట్ల విషయాన్ని ఇతర రాజకీయ పార్టీలు రాజకీయం చేయవద్దని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ బుధవారం అన్నారు. బిసిలకు టిక్కెట్లు అంటూ ప్రకటించిన విజయమ్మకు బిసి సంఘాలు బుధవారం సన్మానం చేశాయి. హైదరాబాదులోని లోటస్ పాండులోని క్యాంప్ కార్యాలయంలో బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో బిసి సంఘాల నేతలు విజయమ్మను కలిశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వంద సీట్లను రాజకీయం చేయవద్దని, అవసరమైతే మిగిలిన పార్టీలు కూడా కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. రాజ్యాధికారంలో బిసిలకు వంద స్థానాలు రిజర్వేషన్ చేసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చారిత్రక నిర్ణయం తీసుకుందని ఆర్.కృష్ణయ్య అన్నారు. ఇతర పార్టీల కంటే ఒక అడుగు ముందుకేసి విజయమ్మ చేసిన ప్రతిపాదనల పట్ల రాష్ట్రంలోని బిసిలందరూ చాలా ఆనందంగా ఉన్నారన్నారు. ఈ విషయంలో పార్టీలు రాజకీయ కోణంలో కాకుండా బిసిల అభివృద్ధి కోణంలో చూడాలన్నారు.

రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఏ క్షణమైనా పడిపోవచ్చునని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వేరుగా అన్నారు. రాష్ట్రంలో పరిపాలన సమర్థవంతంగా లేదని, ఈ విషయం మంత్రులకు, ప్రజలకు తెలుసునన్నారు. 26 జివోలపై ప్రభుత్వం అప్పుడే స్పందించి ఉంటే మంత్రులు జైలుకు వెళ్లే దుస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తును నాశనం చేయాలనే కుట్రకు కాంగ్రెసు తెర తీసిందని, కానీ వారు తీసుకున్న గోతిలో వారే పడ్డారన్నారు.

మంత్రులకు బుద్ధి, జ్ఞానం ఉంటే 26 జివోలపై సమాధానం చెప్పాలని, అప్పుడే ప్రజలు కొంత మేరకు కాంగ్రెసును మన్నించగల్గుతారన్నారు. మంత్రుల ఈ దుస్థితికి కాంగ్రెసు ప్రభుత్వమే కారణమన్నారు. 26 జివోల వల్ల లబ్ధి పొందిన వారు ప్రజలు అని, అందుకే అదే ప్రజలు 2009లో కాంగ్రెసును మళ్లీ గద్దెనెక్కించారన్నారు. టిడిపి అధినేత నారా చంద్రబాబు మాటలను ఎవరూ నమ్మడం లేదని, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పైన అభాండాలు వేయడం హేయమైన చర్య అన్నారు.

English summary
YSR Congress party honorary president YS Vijayamma appealed other political parties to don't make political issue 100 assembly seats issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X