మాజీ ఎంపీ కేశినేని నాని పై కేసు - బ్రదర్స్ వార్ లో బిగ్ టర్న్..!!
కేశినేని బ్రదర్స్ మధ్య వార్ కొత్త టర్న్ తీసుకుంది. కొంత కాలంగా ఇద్దరి మధ్య సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు.. కౌంటర్లు కొనసాగుతున్నాయి. తాజాగా ఎంపీ చిన్ని పైనా నాని ఈడీకి చేసిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం కొత్త మలుపు తీసుకోగా.. ఇప్పుడు నాని పైన చిన్ని చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసారు. ఇటీవల కాలంలో తనను లక్ష్యంగా చేసుకుని అసత్య ప్రచారం చేస్తున్నారని కేశినేని చిన్ని ఫిర్యాదులో పేర్కొన్నారు.
మాజీ ఎంపీ కేశినేని నాని పైన కేసు నమోదు అయింది. 2024 ఎన్నికల ముందు నుంచి బ్రదర్స్ ఇద్దరి మధ్య వార్ మొదలైంది. ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన నాని ఓడిపోయారు. తరువాత రాజకీయాలకు దూరం అవుతున్నట్లు ప్రకటించారు. కాగా.. ఇప్పుడు రెండేళ్ల తరువాత మరోసారి ఈ ఇద్దరి మధ్య సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు.. కౌంటర్లు కనిపిస్తున్నాయి. తాజాగా నాని ఈడీకి సుదీర్ఘ లేఖ రాసారు.

అందులో చిన్ని ఆర్దిక వ్యవహారాల పైన ఫిర్యాదు చేసారు. కాగా, తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు కేశినేని నానపై కేసు నమోదు చేశారు. ఇటీవల కాలంలో తనను లక్ష్యంగా చేసుకుని అసత్య ప్రచారం చేస్తున్నారని కేశినేని చిన్ని ఫిర్యాదులో పేర్కొన్నారు.
విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఫిర్యాదుతో ఆయన సోదరుడు, మాజీ ఎంపీ కేశినేని నానిపై పోలీసులు బీఎన్ఎస్, ఐటీ చట్టం కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు.
కాగా, తనపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులకు కూడా కేశినేని నాని ఫిర్యాదు చేయడమే కాకుండా, చంద్రబాబుకు లేఖలు రాయడం చికాకుగా మారడంతో చిన్ని కేశినేని నానిపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మరో వైపు కేశినేని చిన్ని మరియు అతని కుటుంబం, కేసిరెడ్డి నెట్‌వర్క్‌పై మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద దర్యాప్తు చేపట్టాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి మాజీ ఎంపీ కేశినేని నాని లేఖ రాశారు.
దర్యాప్తును ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తు న్నారని, సుప్రీంకోర్టును తప్పుదారి పట్టించారని, ఈడీ అటాచ్‌మెంట్‌లు, బ్యాంక్ విషయాలను దాచిపెట్టారని నాని ఆరోపించారు. అనేక అక్రమాల్లో చిన్ని పాత్ర ఉందని, విజయవాడ ఉత్సవం పేరుతో స్కాంకు పాల్పడ్డారని, అలాగే ఏసీఏలో అవినీతిపై కూడా దర్యాప్తు జరపాలని ఆయన ఆ లేఖలో కోరారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లోనూ అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదులో నాని పేర్కొన్నారు. ఇక, ఇప్పుడు నాని పైన కేసు నమోదు తో ఈ ఇద్దరి వ్యవహారం ఎటు టర్న్ తీసుకుంటుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.














Click it and Unblock the Notifications