హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హరీష్ అక్కడ ఎర్రబెల్లి ఇక్కడ: తలసాని, కెటిఆర్ అరెస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Errabelli Dayakar Rao - Harish Rao
హైదరాబాద్: విద్యుత్ కొరతపై తెలుగుదేశం పార్టీ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. పార్టీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర రావు ఆధ్వర్యంలో విద్యుత్ సౌధ వద్ద టిడిపి ధర్నాకు దిగింది. వారు కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లే ప్రయత్నాలు చేశారు. దీంతో పోలీసులు ఎర్రబెల్లి, మహేందర్ రెడ్డి, కెఎస్ రత్నం సహా పలువురిని అరెస్టు చేసి పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఎర్రబెల్లి పోలీసు స్టేషన్‌లోనే తన ఆందోళనను కొనసాగిస్తున్నారు. సికింద్రాబాదులో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, తీగల కృష్ణా రెడ్డిలను పోలీసులు అరెస్టు చేసి సైఫాబాద్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... విద్యుత్ కొరత వల్ల రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అయినా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉందని ఆరోపించారు. ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేపట్టిన తమను అరెస్టు చేయడమేమిటని వారు పోలీసులపై మండిపడ్డారు. ప్రజల కష్టాలను చూడకుండా ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆరోపించారు. విద్యుత్ కోతలపై టిడిపికి వామపక్షాలు కూడా జతకలిశాయి. గోషామహల్ స్టేడియంలో టిడిపి మహిళా నేతలు... తమ పట్ల పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారని, హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.

ఇదే విషయమై సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు సచివాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అడ్డుకొని కెటిఆర్ సహా పలువురిని అరెస్టు చేశారు. విద్యుత్ సౌధ వద్ద, సచివాలయం వద్ద పార్టీల ఆందోళన కారణంగా ఆ ప్రాంతాలలో భారీగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

మరోవైపు మంగళవారం అరెస్టైన తెరాస ఎమ్మెల్యే హరీష్ రావు బొల్లారం పోలీసు స్టేషన్‌లో తన నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. దీక్ష కోసం తెరాస నేతలు పోలీసు స్టేషన్ ఎదుట టెంట్ వేశారు. దీనిని పోలీసులు తొలగించారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత తెరాస కార్యకర్తలు మరోమారు టెంట్ వేసుకున్నారు.

ఈ సందర్భంగా హరీష్ రావు, రాజయ్యలు మాట్లాడుతూ... ఎస్సైని దుర్భాషాలాడిన మంత్రి దానం నాగేందర్ పైన ప్రభుత్వం ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని, కానీ ప్రజల కోసం పోరాడుతున్న తమను అరెస్టు చేయడమేమిటని ప్రశ్నించారు. తమది న్యాయపోరాటమన్నారు. ఈ విషయాన్ని తాము అసెంబ్లీలో ప్రస్తావిస్తామని, హైకోర్టుకు కూడా వెళ్తామని చెప్పారు. ప్రభుత్వం ప్రజలను బ్లాక్ చేయడం మానేసి సమస్యలు పరిష్కరించాలని హితవు పలికారు. రైతులకు ఏడు గంటల విద్యుత్ ఇచ్చే వరకు ఉద్యమిస్తామన్నారు.

English summary

 Telugudesam party leaders Errabelli Dayakar Rao and Talasani Srinivas Yadav were arrested by Hyderabad police at vidyuth soudha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X