కలిసిపోయిన విజయ్- సంగీత..? అక్కడే త్రిష ట్విస్ట్..!!

తమిళనాడు సీఎం విజయ్.. సంగీత తిరిగి కలిసిసోయారా. ఇప్పుడు ఇదే వ్యవహారం పొలిటికల్ - సినీ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఎన్నికల సమయంలో విజయ్ భార్య సంగీత.. తన భర్త నటి త్రిషతో రిలేషన్ లో ఉన్నారని, తనను, తన పిల్లలను ఆయన మోసం చేశారని, తనకు విడాకులు ఇప్పించాలాని కోర్టులో కేసు వేశారు. అయితే, సీఎం అయిన తరువాత కుటుంబంలోని అంశాలపైన విమర్శలకు ఎవరికీ అవకాశం ఇవ్వకూడదని భావించిన విజయ్ తల్లి జోక్యంతో ఈ వివాదం సమిసిపోయినట్లు తెలుస్తోంది.

విజయ్ వ్యక్తిగత జీవితం పైన విమర్శలకు ఎవరికీ అవకాశం ఇవ్వకూడదని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఈ మేరకు చేసిన ప్రయత్నాలు ఫలించినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా విజయ్, ఆయన భార్య సంగీత విడివిడిగా ఉంటున్న విషయం తెల్సిందే. ఎన్నికల సమయంలో విజయ్ భార్య సంగీత.. తన భర్త నటి త్రిషతో రిలేషన్ లో ఉన్నారని, తనను, తన పిల్లలను ఆయన మోసం చేశారని, తనకు విడాకులు ఇప్పించాలాని కోర్టులో కేసు వేశారు. విజయ్ సీఎం అయ్యినప్పుడు కానీ, ప్రమాణ స్వీకారం అప్పుడు కానీ.. సంగీత, పిల్లలు ఆయన పక్కన లేరు.

 విజయ్ కు లారెన్స్ బిగ్ ట్విస్ట్, అన్నామలై ఎంట్రీతో..!?
విజయ్ కు లారెన్స్ బిగ్ ట్విస్ట్, అన్నామలై ఎంట్రీతో..!?
Vijay in Spotlight Amid Fresh Reunion Speculation With Sangeetha here the full details

త్వరలోనే విజయ్.. త్రిషను పెళ్ళి చేసుకుంటున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. ఇక తాజాగా ఇండస్ట్రీ మొత్తానికి షాక్ ఇచ్చినట్లు విజయ్ - సంగీత కలిసిపోయారని సమాచారం. వీరిద్దరి మధ్య ఉన్న మనస్పర్థలను పరిష్కరించి, ఈ జంటను తిరిగి ఒకటి చేయడానికి కుటుంబ సభ్యులు తెరవెనుక గట్టి ప్రయత్నాలే చేసినట్లు తెలుస్తోంది. కొడుకు- కోడలిని కలపడానికి విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ అత్యంత కీలక పాత్ర పోషించినట్లు తెలుస్సతోంది .

తన కుమారుడు రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, అలాగే కుటుంబ బంధాలను కాపాడుకోవడానికి శోభ స్వయంగా కోడలు సంగీతతో మాట్లాడి, ఇరుపక్షాల మధ్య ఉన్న విభేదాలను సక్సెస్ ఫుల్‌గా సెటిల్ చేసినట్లు టాక్ నడుస్తోంది. తల్లి చేసిన ప్రయత్నాల వల్లనే విజయ్ - సంగీత మళ్లీ కలిసి ఒకే ఇంట్లో ఉండటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సంగీత మళ్లీ ఆయన పక్కన చేరడం పొలిటికల్‌గా విజయ్ కు కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. మరో వైపు విజయ్ కొడుకు జేసన్ సంజయ్ కి కూడా ఇప్పుడు తండ్రి సపోర్ట్ చాలా అవసరం. అందుకే సంగీత కూడా భర్తతో ఉండడానికి ఒప్పుకొన్నారని అంటున్నారు.

నిర్ణయం మార్చుకున్న లారెన్స్, విజయ్ ప్రతిపాదన తో..!!
నిర్ణయం మార్చుకున్న లారెన్స్, విజయ్ ప్రతిపాదన తో..!!

అంతా బానే ఉన్నా.. ఇప్పుడు త్రిష పరిస్థితి ఏంటి అనేది సస్పెన్స్ గా మారుతోంది. ప్రేమ, పెళ్ళి అంటూ విజయ్ వెనుక తిరిగిన త్రిషకు ఇప్పటివరకు ఒరిగింది ఏం లేదు. అలాంటప్పుడు విజయ్ - సంగీత కలిసిపోతే త్రిష ఫ్యూచర్ ఏంటనేది కీలకంగా మారుతోంది. త్రిషతో తన భర్త రిలేషన్ లో ఉన్నారని డైరెక్ట్ గా చెప్పిన సంగీత.. ఇప్పుడు సడెన్ గా కలిసిపోయారు అంటే త్రిష- విజయ్ రిలేషన్ ని ఆమె అంగీకరించి నట్లేనా , లేకుంటే.. అత్త శోభా.. త్రిషను దూరం పెట్టమని కొడుకుకు చెప్పి ఒప్పించారా.. ఇలా ఎన్నో చర్చలు ఇప్పుడు జోరుగా సాగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+