వేట నిషేధం వేళ వలకు చిక్కిన భారీ చేపలు.. రేటు వింటే షాకే!

వలస పక్షుల కంటే వేగంగా ప్రయాణిస్తూ, పదునైన కత్తిలాంటి ముక్కుతో సాగర సామ్రాజ్యాన్ని శాసించే 'బ్లాక్ మార్లిన్' (కొమ్ముకోణం) చేపలు తాజాగా విశాఖ తీరంలో సందడి చేశాయి. వేట నిషేధ కాలంలో సంప్రదాయ మత్స్యకారుల వలలకు ఈ భారీ జలచరాలు చిక్కడం విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

సాధారణంగా కొమ్ముకోణం (బ్లాక్ మార్లిన్) చేపలు సముద్రం పైభాగంలో కాకుండా.. చాలా లోతైన అగాధాల్లో జీవిస్తుంటాయి. వీటిని వేటాడాలంటే పెద్ద పెద్ద మెకనైజ్డ్ బోట్లతో సాగరంలోకి కిలోమీటర్ల మేర లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుతం సముద్రంలో చేపల వేటపై వార్షిక నిషేధం అమల్లో ఉండటంతో మత్స్యకారులు బోట్లతో లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదు. కానీ, సంప్రదాయ మత్స్యకారులు మాత్రం చిన్న చిన్న తెరచాప పడవలపై తీరానికి కొద్ది దూరంలో వేట సాగించుకోవచ్చు. అలా శుక్రవారం విశాఖ తీరంలో వేటకు వెళ్లిన కొద్దిమంది మత్స్యకారులకు అనూహ్యంగా అదృష్టం తగిలింది. భారీ పరిమాణంలో ఉండే బ్లాక్ మార్లిన్ చేపలు వారి వలలకు చిక్కాయి.

Massive 200 KG Black Marlin Fish Caught By Traditional Fishermen In Vizag Coast Fetches Over 30000 Rupees

వలల్లో పడిన ఈ కొమ్ముకోణం చేపలను మత్స్యకారులు అతికష్టం మీద విశాఖపట్నం చేపల రేవుకు (ఫిషింగ్ హార్బర్) తరలించారు. ఇవి ఒక్కొక్కటి దాదాపు 150 కిలోల నుంచి 200 కిలోల వరకు బరువుండటంతో రేవులోని వ్యాపారులు, స్థానికులు వీటిని చూసేందుకు ఆసక్తి చూపారు. మార్కెట్లో ఈ చేపల మాంసానికి మంచి డిమాండ్ ఉండటంతో వ్యాపారుల మధ్య గట్టి పోటీ నెలకొంది. వేలం పాటలో ఒక్కో భారీ చేప దాదాపు 30 వేల రూపాయలకు పైగా ధర పలికింది. వేట లేక ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ అరుదైన చేపలు పడటంతో సదరు మత్స్యకారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

అస్థిపంజరాలు చెప్పిన ఏళ్ల నాటి రహస్యం.. గూస్ బంప్స్ తెప్పించే వింత!
అస్థిపంజరాలు చెప్పిన ఏళ్ల నాటి రహస్యం.. గూస్ బంప్స్ తెప్పించే వింత!

మనిషిని సైతం చంపేసే 'మహా శక్తులు'!

పైకి సాధారణంగా కనిపించే ఈ కొమ్ముకోణం (బ్లాక్ మార్లిన్) చేపల వెనుక ఒక భయంకరమైన హిస్టరీ ఉంది. సముద్రంలో అత్యంత వేగంగా ఈదగల జీవుల్లో ఇదొకటి. ఇవి గంటకు దాదాపు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. వీటికి ముక్కు భాగంలో ఉండే పదునైన కొమ్ము (కత్తిలాంటి నిర్మాణం) అత్యంత ప్రమాదకరమైనది. సముద్రంలో వేటాడే సమయంలో తోటి జీవులను చంపడానికి, శత్రువుల నుండి తనను తాను రక్షించుకోవడానికి ఈ కొమ్మును ఒక ఆయుధంగా వాడుతుంది.

సముద్రం లోపల దాగున్న భౌగోళిక మహావిస్మయం!
సముద్రం లోపల దాగున్న భౌగోళిక మహావిస్మయం!

ఈ చేపలకు కోపం వస్తే ఎంతటి ప్రమాదకరంగా మారుతాయంటే.. ఒక్కోసారి మత్స్యకారుల బోట్లను, పడవలను సైతం తమ పదునైన ముక్కుతో పొడిచి రంధ్రాలు చేస్తాయి. గతంలో సముద్రంలో ఈ కొమ్ముకోణం చేపలను పట్టుకునే క్రమంలో, ఇవి ఒక్కసారిగా పైకి ఎగిరి తమ కత్తిలాంటి ముక్కుతో పొడవడంతో కొందరు మత్స్యకారులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. అందుకే అంతర్జాతీయ సముద్ర వేటగాళ్లు సైతం ఈ బ్లాక్ మార్లిన్ చేపను పట్టుకునేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉంటారు. ఈ నేపథ్యంలో, ఎలాంటి అత్యాధునిక సాంకేతికత లేని చిన్న తెరచాప పడవపై ఇంతటి ప్రమాదకరమైన భారీ చేపలను సురక్షితంగా తీరానికి తెచ్చిన విశాఖ మత్స్యకారుల సాహసాన్ని స్థానికులు అభినందిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+