హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ధర్మాన: కిరణ్‌కు అధిష్టానం పిలుపు, సోనియాతో కిల్లి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్/న్యూఢిల్లీ: మంత్రి ధర్మాన రాజీనామా వ్యవహారంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఢిల్లీ నుండి పిలుపు వచ్చింది. గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు అందుబాటులో ఉండాలని అధిష్టానం కిరణ్‌ను ఆదేశించింది. కిరణ్‌తో ఢిల్లీ పెద్దలు ధర్మాన వ్యవహారం చర్చించనున్నారు. అనంతరం ఆయన రాజీనామాపై ఓ నిర్ణయానికి రానున్నారు. ఇందుకోసం కిరణ్ రేపు ఉదయం ఆరు గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు.

ఇదే విషయాన్ని చర్చించేందుకు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లారు. ఆయన ఢిల్లీ పెద్దలతో ఈ విషయాన్ని సీరియస్‌గా చర్చిస్తున్నారు. బొత్స కేంద్రమంత్రి వాయలార్ రవితో భేటీ అయ్యారు. మరోవైపు శ్రీకాకుళం పార్లమెంటు సభ్యురాలు కిల్లి కృపారాణి ఈ రోజు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. ఈ సందర్భంగా ఆమె ధర్మాన రాజీనామాను ఆమోదించవద్దని సోనియాకు విజ్ఞప్తి చేశారు. ధర్మానకు ఇబ్బంది కలిగితే శ్రీకాకుళం జిల్లాలో పార్టీకి నష్టం చేకూరుతుందని సోనియా దృష్టికి తీసుకు వెళ్లారు.

ధర్మాన రాజీనామా విషయంతో పాటు పార్టీలో అసమ్మతి, ఇందిర బాట, పవర్ కట్ తదితర అంశాలపై కిరణ్ పార్టీ పెద్దలతో చర్చించనున్నారు. ఇక ధర్మాన రాజీనామా అంశం ఢిల్లీకి చేరడంతో మంత్రివర్గంలో టెన్షన్ టెన్షన్ నెలకొంది. హైకమాండ్ ఆయన రాజీనామాపై ఎలా స్పందిస్తుందోననే ఆందోళన వారిలో నెలకొంది. రాజీనామా ఆమోదిస్తారా లేదా మరో మార్గం చూపుతారా అనేది రేపు తేలనుంది.

English summary
CM Kiran Kumar Reddy has got a call from the high command directing him to come to Delhi on Thursday. Therefore, Kiran is most likely to leave for Delhi morning itself. The sources said that high command is most likely to discuss the resignation of Dharmana Prasada Rao besides current political situation in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X