రేప్ అంటే రేప్ అంతే: టోడ్ ఆకిన్ వ్యాఖ్యలపై ఒబామా

అంతకుముందు, అత్యాచారానికి గురైన మహిళలకు గర్భాస్రావాలు చేయించడాన్ని మీరు సమర్థిస్తారా? అని ఓ ఇంటర్వ్యూలో టాడ్ అకిన్‌ను ప్రశ్నించారు. దానికి ఆయన జవాబిస్తూ.. డాక్టర్ల ద్వారా నాకు తెలిసిందేమిటంటే.. అటువంటి ఘటనలు చాలా అరుదు అని, అది చట్టబద్ధంగా చేసిన అత్యాచారం అయితే, గర్భాస్రావం చేయించుకునే అవకాశం మహిళకు ఉంటుందని వ్యాఖ్యానించారు. టాడ్ ఆకిన్ అమెరికాలోని రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడే కాక మిస్సోరీ పార్టీ సెనేట్ సభ్యుడు.
కాగా, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి మిట్ రోమ్నీ కూడా ఆయన వ్యాఖ్యలను తప్పుబట్టారు. అవి క్షమించరానివని అన్నారు. ఒబామా ఖండించిన తర్వాత అకిన్ కూడా తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు. కాగా, చట్టసభల్లో పురుషుల సంఖ్యే ఎక్కువగా ఉందని, మహిళల ఆరోగ్యానికి సంబంధించి కూడా వారే నిర్ణయాలు చేసేస్తున్నారని, అందుకే ఇటువంటి వ్యాఖ్యలకు ప్రాధాన్యం లభిస్తోందని ఒబామా చెప్పారు.












Click it and Unblock the Notifications