కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిద్రిస్తే చనిపోతారు: పుకార్లతో 6జిల్లాల్లో రాత్రంతాజాగారం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Andhrapredesh Map
హైదరాబాద్/కర్నూలు/నిజామాబాద్: నిద్రపోతే చనిపోతారు అనే పుకార్లు జోరుగా షికారు చేయడంతో రాష్ట్రంలోని ఆరు జిల్లాలలో చాలామంది ప్రజలు బుధవారం రాత్రంతా కునుకు తీయకుండా మెలుకువతో ఉన్నారు. రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాదుతో పాటు రంగారెడ్డి, నిజామాబాద్, కర్నూలు, అనంతపురం, మెదక్ జిల్లాలలోని పలు గ్రామాలలో ప్రజలు రోడ్డు పైకి వచ్చి జాగారం చేశారు.

నవజాత శిశువు మాట్లాడిందని, రాత్రి నిద్రపోతే ప్రజలు చచ్చిపోతారని చెప్పిందనే పుకార్లు ఈ జిల్లాల్లోని పలు గ్రామాలలో వ్యాపించాయి. అప్పుడే పుట్టిన పాప మాట్లాడటమే వింత అంటే చనిపోతారని చెప్పడం మరింత వింత అని కాబట్టి నిద్ర పోకుండా ఉండటమే ఉత్తమమనే భావనతో ప్రజలు తెల్లవార్లూ జాగారం చేశారు.

పిల్లాపాపలతో ఇంటి బయట, రోడ్ల మీదనే కాలక్షేపం చేశారు. ఇటీవల విజయవాడలో మెహందీ పెట్టుకుంటే అనారోగ్యం పాలవుతునే పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో మెహందీ పెట్టుకున్న పలువురు వెంటనే ఆసుపత్రులకు పరుగెత్తారు. ఇవన్నీ వట్టివేనని, ఇలాంటి పుకార్లను ఎవరూ నమ్మవద్దని పలువురు సూచిస్తున్నారు.

English summary
Six districts(Hyderabad, Medak, Mahaboobnagar, Anantapur, Nizamabad and Kurnool) people of Andhra Pradesh did not slept on Wednesday night with fearing rumors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X