ఢిల్లీలో కన్నాకు చేదుఅనుభవం: చిందులుతొక్కిన పవార్

Sharad Pawar - Kanna Laxminarayana
న్యూఢిల్లీ: మంత్రి కన్నా లక్ష్మీ నారాయణకు ఢిల్లీలో చేదు అనుభవం ఎదురయింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ మంత్రి కన్నా పైన గురువారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పదే పదే ఎందుకు వస్తున్నారంటూ చిందులు తొక్కారు. రాష్ట్రంలోని వ్యవసాయ సమస్యలపై అఖిల పక్షంతో కలిసి కన్నా కేంద్రమంత్రి పవార్‌ను కలిసేందుకు వెళ్లారు. పవార్ ఈ ఉదయం పదకొండున్నర గంటలకు కన్నా బృందానికి అపాయింట్‌మెంట్ ఇచ్చారు. అదే సమయానికి కన్నా బృందం వెళ్లింది.

అఖిలపక్షంతో పాటు రాష్ట్రానికి చెందిన ఎంపీలు కెవిపి రామచంద్ర రావు, లగడపాటి రాజగోపాల్, కిల్లి కృపారాణి, ఉండవల్లి అరుణ్ కుమార్, పొన్నం ప్రభాకర్ తదితరులు ఉన్నారు. అక్కడకు వచ్చిన పవార్ కన్నాను చూసి ఒక్కసారిగా రెచ్చిపోయారు. మంత్రి మారినప్పుడల్లా ఇలా వచ్చి ఎందుకు దాడి చేస్తున్నారని మండిపడ్డారు. చెప్పాల్సింది ఒకసారి చెబితే సరిపోతుందని, రైతుల సమస్యలు తమకు తెలుసునని, ఎన్నిసార్లు కలుస్తారని, పదే పదే రావాల్సిన అవసరం లేదంటూ క్లాస్ పీకారు.

ప్రతిసారి వచ్చి ఇంత హడావుడి చేయడం అవసరమా అని ప్రశ్నించారు. వేలాపాలా లేకుండా వచ్చేస్తున్నారంటూ ఆక్రోషం వ్యక్తం చేశారు. మీ ప్రవర్తన యుద్దానికి వచ్చినట్లుగా ఉందని చిందులు తొక్కారు. మంత్రి మారినప్పుడల్లా అఖిలపక్షంతో రావడం సరికాదన్నారు. శరద్ పవార్ ఆగ్రహం చూసి కన్నా అవాక్కయ్యారు. మంత్రికి సమస్యలు చెబుతామని వస్తే ఆయనే ఆగ్రహం వ్యక్తం చేయడం పట్ల అక్కడే ఉన్న ఎంపీలు సైతం కంగు తిన్నారు. మంత్రి సానుకూలంగా స్పందిస్తారనుకుంటే ఇలా ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+