ఫైలే చూడలేదు, వైయస్ బాధ్యుడు: మంత్రి కన్నా

తర్వాత విడుదలైన జీఓ 12 కేవలం పరిపాలనా పరమైనది మాత్రమేనని వివరించారు. బుధవారం ఏపీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2005-10 పారిశ్రామిక విధానాన్ని అనుసరించి రామ్‌కీ సంస్థకు రిజిస్ట్రేషన్, స్టాంపు ఫీజుల నుంచి మినహాయింపు ఇస్తూ, విద్యుత్‌ను కేటాయిస్తూ 2006లోనే ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో 741) జారీ చేసిందని, దీనికి వైయస్ రాజశేఖరరెడ్డి ఆమోదం తెలిపారని వెల్లడించారు.
దీనికి అనుగుణంగా ఆర్థిక శాఖ బీఆర్‌వో ఉత్తర్వులను (జీవో 642) జారీ చేయగా, తర్వాత పరిశ్రమల శాఖ విడుదల చేసిన జీవో12 కేవలం పరిపాలనా పరంగా నిధుల విడుదలకు సంబంధించినది మాత్రమేనని చెప్పారు.
బిజినెస్ రూల్స్ ప్రకారం పరిపాలనా పరమైన జీవోలను ముఖ్యకార్యదర్శులే విడుదల చేస్తారని, ఆ ఫైళ్లు మంత్రి వద్దకు రావన్నారు. ఎవరో చేసిన తప్పుకు తాము బలయ్యామన్నదే తమ ఆవేదన అని కన్నా చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో కన్నా లక్ష్మినారాయణ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న మంత్రుల్లో ఆయన కూడా ఉన్నారు.












Click it and Unblock the Notifications