కిరణ్ జగన్ కోవర్టు: సోనియాతో శంకరన్న, సబిత పైన..

అదే సమయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు రవాణా శాఖ మంత్రిల పైనా సోనియాకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపి వైయస్ జగన్మోహన్ రెడ్డి కోవర్టుగా మారి అతనిని రక్షిస్తున్నారని, ధర్మాన ప్రసాద రాజీనామాను ఆమోదించవద్దని కూడా ఆమెను కోరారని సమాచారం. అంతకుముందు శంకర రావు ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి నారాయణ స్వామిని కలిశారు.
పలువురు మంత్రులపై ఫిర్యాదు చేశారు. హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డిని సిబిఐ ఎందుకు విచారించడం లేదని, సిబిఐ పక్షపాత వైఖరిపై చర్యలు తీసుకోవాలని నారాయణ స్వామిని కోరారు. భేటీ అనంతరం శంకర రావు మాట్లాడుతూ.. ఓబుళాపురం మైనింగ్ కేసులో సిబిఐ పక్షపాతంగా వ్యవహరిస్తోందని, సబితను సిబిఐ ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. వాన్ పిక్ కేసులో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణని అరెస్టు చేసిన సిబిఐ ఓఎంసి కేసులో భిన్నంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సిబిఐ పక్షపాత వైఖరిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు.
మరోవైపు సోనియాతో పలువురు రాష్ట్ర నేతలు భేటీ అయ్యారు. పిసిసి ప్రధాన కార్యదర్శి గౌరీ శంకర్.. సోనియాను కలిసి నామినేటెడ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ చైర్మన్ ఎం.సత్యనారాయణ కలిసి పార్టీ బలోపేతంపై సోనియాకు పలు సూచనలు చేశారని తెలుస్తోంది. కాగా ముఖ్యమంత్రి కిరణ్.. సోనియాతో సాయంత్రం ఐదు గంటలకు భేటీ కానున్నారు.












Click it and Unblock the Notifications