కెవిపికి అన్నీ తెలుసు ఐనా: సిబిఐపై శంకరన్న ఫిర్యాదు

జగన్ సంపాదన, ఆయన ఆస్తుల గురించి రాష్ట్ర భద్రతా కమిటీ అధ్యక్షుడిగా, ప్రభుత్వ సలహాదారుగా ఉన్న కెవిపి రామచంద్ర రావుకు అన్నీ తెలుసునని, ఈ మొత్తం వ్యవహారాలు ఆయన కనుసన్నల్లోనే జరిగాయని, కానీ... కెవిపిని సిబిఐ ఇప్పటిదాకా ఒక్కసారి కూడా పిలిచి ప్రశ్నించలేదని శంకర రావు తన ఫిర్యాదులో తెలిపారు. అలాగే... ప్రస్తుత హోంమంత్రి, నాటి గనుల మంత్రి సబితా ఇంద్రా రెడ్డిని నిందితురాలిగా కాకుండా, కేవలం సాక్షిగా మాత్రమే పేర్కొనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ కేసుల దర్యాప్తులో సిబిఐ పనితీరు ఏమాత్రం బాగాలేదని, దీనిపై దృష్టి సారించి, నిష్పాక్షిక దర్యాప్తు జరిగేలా తగిన ఆదేశాలు జారీ జారీ చేయాలని శంకర రావు సివిసిని కోరారు. కాగా సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో జగన్ ఆస్తులు, గాలి జనార్ధన్ రెడ్డి ఓఎంసి, ఎమ్మార్ తదితర కేసులను సిబిఐ దర్యాఫ్తు చేస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications