నేతన్న ఆత్మహత్య: కుటుంబానికి టిడిపి పరామర్శ

Karimnagar District
కరీంనగర్: కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో మరో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన చిట్యాల లక్ష్మినర్సయ్య అప్పుల బాధ భరించలేక ఇంట్లో ఉరివేసుకున్నాడు. రెండు నెలల క్రితం కూతురు వివాహం కోసం రెండు లక్షల రూపాయల అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చలేక అతను మనోవేదనకు గురయ్యాడు.

దానికి తోడు మరమగ్గాలు నడవకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన లక్ష్మినర్సయ్య బలవన్మరణానికి పాల్పడ్డాడు. మరోవైపు కరెంట్ కోతల వల్లనే లక్ష్మినర్సయ్య ఆత్మహత్య చేసుకున్నాడంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో సిరిసిల్ల కొత్త బస్టాండులో ధర్నాకు దిగారు.

మృతుడి కుటుంబ సభ్యులను తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు నాయకత్వంలో పార్టీ నాయకులు పరామర్శించారు. తెలుగుదేశం నాయకులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. చివరకు వారిని పోలీసులు అనుమతించారు. మృతుడి కుటుంబానికి తెలుగుదేశం నాయకులు లక్ష రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై, రాష్ట్ర ప్రభుత్వంపై ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా ధ్వజమెత్తారు. లక్ష్మీనరసయ్య మృతికి కారణమైన ముఖ్యమంత్రిపై హత్యనేరం కింద కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లక్ష్మినరసయ్య కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, కటుంబానికి ఐదు లక్ష రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+