మాజీ జూనియర్ ఆర్టిస్ట్ హత్య: నెలల తర్వాత భర్త అరెస్ట్

మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రాజు అసిస్టెంట్ మేకప్‌మేన్‌గా పని చేసేవాడు. వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకొని ఓ పాప పుట్టాక, నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డికి వచ్చారు. రాజేశ్వర్ స్థానిక హోటల్‌లో పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే భార్యాభర్తలిద్దరికీ తరుచూ గొడవ జరుగుతుండేది. గత ఏడాది డిసెంబరు 5న భాగ్యను ఇంటిలోనే గొంతు నులిమి భర్త హత్య చేశాడు.
అర్ధరాత్రివేళ మృతదేహాన్ని సంచిలో చుట్టి సెప్టిక్ ట్యాంక్‌లో పడేసి మట్టి పోశాడు. తర్వాత ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు. పోలీసులు మరో కేసులో దొంగను విచారిస్తుండగా అతని వద్ద రాజు సెల్ ఫోన్ నెంబర్ దొరికింది. దీని ఆధారంగా విచారించగా విషయమంతా బయటపడింది. రాజు గతంలో కూడా హైదరాబాదులో ముంబయికి చెందిన ఒక మహిళను హత్య చేశాడని ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు అతనిని అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications