జెడి కాల్‌లిస్ట్: బెయిలిచ్చారు,లుక్‌ఔట్ వద్దు..రఘురామ

కాగా కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ స్కాం కేసులో ఎ1గా ఉన్న సిబిఐ కోర్టు మాజీ జడ్జి పట్టాభి రామారావు మరో మారు బెయిల్ పిటిషన్ వేశారు. తొలి రెండుసార్లు కేసు దర్యాప్తులో ఉన్నందున బెయిల్ మంజూరీ కుదరదంటూ ఎసిబి కోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ కేసులో చార్జిషీట్ దాఖలైన నేపథ్యంలో తాజగా పట్టాభి మరో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
ఇదే కేసులో నిందితులు చలపతి రావు, రవిచంద్ర బెయిల్ పిటిషన్ల పైనా గురువారం వాదనలు విన్న జడ్జి తీర్పును శనివారానికి వాయిదా వేశారు. ఇక గాలి జనార్థన్ రెడ్డి సోదరుడు సోమశేఖర్ రెడ్డి, కంప్లి ఎమ్మెల్యే సురేష్ బాబు బెయిల్ పిటిషన్లపై వాదనలు 27కు వాయిదా పడ్డాయి. ప్రత్యేక ఖైదీలుగా పరిగణించాలంటూ సోమశేఖర్ రెడ్డి, సురేష్ బాబు దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును కూడా శనివారానికి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications