రోడ్డు ప్రమాదంలో మహిళా టెక్కీ దుర్మరణం

శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో హుమాయున్‌నగర్‌లోని ఇంటి నుంచి కెనెటిక్ హోండా వాహనంపై ఆమె ఆఫీసుకు బయలుదేరింది. మెహిదీపట్నంలోని క్రీసెంట్ ఆస్పత్రి వద్ద యూ మలుపు తిరుగుతుండగా వెనుక నుంచి వచ్చిన ఓ ప్రైవేట్ కళాశాలకు చెందిన బస్సు ఢీకొంది. వాహనం పైనుంచి కిందపడ్డ కల్పనసింగ్ పైనుంచి వాహనాలు దూసుకెళ్లాయి. తల నుజ్జునుజ్జుకావడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది.
సమాచారం తెలుసుకున్న హుమాయున్‌నగర్ పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు హుమాయున్‌నగర్ ఇన్‌స్పెక్టర్ భిక్షంరెడ్డి తెలిపారు.
ఉద్యోగరీత్యా కల్పనసింగ్ తండ్రి ఎస్‌కేసింగ్ కొన్ని సంవత్సరాల క్రితం నగరానికి వచ్చాడు. ఆరు నెలల నుంచి వీరు హుమాయున్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. మృతదేహాన్ని లక్నో తీసుకువేళ్లేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు.












Click it and Unblock the Notifications