హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గనులతో గాలికి కోట్లు, దోపిడీకి ప్రధాని సహకారం: బాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: దేశ సంపదను కొంతమంది ఇష్టారాజ్యంగా కొల్లగొడుతున్నారని, దానికి ప్రధానమంత్రి లాంటి వ్యక్తి సహకరించడం సిగ్గు చేటు అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎంపీలను డబ్బుతో కొని అణు ఒప్పంద బిల్లును గతంలో యుపిఏ ప్రభుత్వం ఆమోదింప చేసుకుందని గుర్తు చేశారు.

కాగ్ నివేదికను ప్రధానమంత్రి తప్పు పట్టడం సరికాదన్నారు. ఈ నివేదికను పిఏసిలో సవాల్ చేస్తానని మన్మోహన్ చెప్పడం హాస్యాస్పదమని, కేంద్ర ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే హక్కు లేదని బాబు మండిపడ్డారు. అడ్డంగా దోచుకునేందుకు ఖనిజ సంపద, సెజ్‌లను అక్రమార్కులు మార్గాలుగా ఎంచుకుంటున్నారని విమర్శించారు. దేశ సంపదను కొందరు వ్యక్తులు కొల్లగొడుతుంటే ప్రధాని అచేతనంగా ఉండటం విడ్డూరమన్నారు.

విదేశాలకు ఎంత డబ్బు పోయిందో చెప్పే పరిస్థితుల్లో కేంద్రం లేదన్నారు. బొగ్గు గనుల కేటాయింపులు వెంటనే రద్దు చేయాలని, జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కుంభకోణానికి బాధ్యత వహిస్తూ ప్రధాని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ వ్యవస్తలను నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారని ఆరోపించారు. కాగ్ నివేదికను తప్పు పట్టి తప్పించుకోవాలని ప్రధాని, కేంద్రం చూస్తోందన్నారు.

కాంపిటేటివ్ బిడ్డింగులను పలు రాష్ట్రాలు వ్యతిరేకించాయని ప్రధాని చెప్పడం శోచనీయమన్నారు. ప్రధాని స్థాయి వ్యక్తి చేతకాదని చెప్పడమేమిటన్నారు. సహజ వనరులను రక్షించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందన్నారు. విద్యుత్ రంగం అస్తవ్యస్తంగా తయారయిందన్నారు. ప్రముఖ సామాజి సంఘ సంస్కర్త అన్నాహజారే పార్టీ పెట్టడం తగదని అన్నారు.

English summary
Telugudesam Party chief Nara Chandrababu Naidu alleged PM Manmohan Singh is helping to corruptionists.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X