మాయలేడి మంగమ్మ ఫ్యామిలీ: చోరీలతో కోట్ల సంపాదన

ఆమెను అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. చోరీల ద్వారా సేకరించిన సొమ్మునంతా ఈ ఫ్యామిలీ ఐదు బ్యాంకుల్లో భద్రపరిచినట్లు తెలుసుకున్న పోలీసులు ఆమెను కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోర్టును కోరారు. పదేళ్ల చోర వృత్తితో ఈ కుటుంబం కిలో బంగారం కూడబెట్టింది. ఐదు బ్యాంకు ఖాతాల్లో రూ.37 లక్షలు కూడబెట్టింది.
మరో రూ.30 లక్షలు అధిక వడ్డీలకు అప్పులిచ్చింది. ఇంకో రూ.10 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో బ్యాంకుల్లో భద్రపరిచింది. వీరికి పది ప్లాట్లు కూడా ఉన్నాయని విచారణలో తేలింది. ఇందుకు సంబంధించిన పత్రాలన్నీ బ్యాంకులాకర్లలో దొరికాయి. వీటన్నిటినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగమ్మను పోలీసులు అరెస్టు చేయగానే కోర్టును ఆశ్రయించిన తండ్రీకొడుకులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పోలీసులు వీరికోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
బస్టాండులు, రద్దీ ప్రదేశాలలో ప్రయాణికుల్ని ఏమార్చి చేతివాటాన్ని ప్రదర్శించే మాయలేడి మంగమ్మ ఆస్థులు రెండు కోట్లకు పైగానే ఉన్నట్టు తెలిసింది. కస్టడీ ముగియడంతో ఈమెను బుధవారం మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచి అనంతరం చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు. గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు, నగరంలోని చాంద్రాయణగుట్టలో ఉంటూ హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో వరుస చోరీలకు పాల్పడ్డారు.
తాడేపల్లిలోని అలహాబాద్ బ్యాంక్, చైతన్య గోదావరి బ్యాంక్, సీతానగర్‌లోని ఎస్‌బీహెచ్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, చాంద్రాయణగుట్టలోని ఆంధ్రా బ్యాంక్‌లో వీరికి ఖాతాలున్నాయి. చోరీల ద్వారా సేకరించిన సొత్తంతా బ్యాంకుల్లో భద్రపరిచినట్టు సమాచారాన్ని సేకరించిన పోలీసులు మంగమ్మను కస్టడీకి అప్పగించాలంటూ కోర్టును ఆశ్రయించగా ఆరు రోజుల విచారణకు అనుమతిస్తూ అంగీకరించింది.












Click it and Unblock the Notifications