కెసిఆర్ నాకేం చెప్పలేదు: తెలంగాణ సంకేతాలపై జూపల్లి

తెలంగాణ వస్తే సంబరం..లేకపోతే సమరానికి సిద్ధంకండనే కేసీఆర్ చెబుతూ వస్తున్నారని తెలిపారు. జూపల్లి ఆదివారం ఇక్కడ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. "అయితే సంబరం, సమరం మధ్య మిగిలింది ఘడియలే. ఇప్పటికే పదేళ్లు గడిచిపోయాయి. ఏం చేయాలనేది మా నాయకుడు (కేసీఆర్) నిర్ణయిస్తారు'' అని చెప్పారు.
కాంగ్రెస్ అధిష్ఠానం కెసిఆర్‌ను ఢిల్లీకి పిలిచినా, పిలవకపోయినా..తెలంగాణ సాధించటం లక్ష్యంగా ఎన్నో వ్యూహాలు ఉంటాయన్నారు. తెలంగాణ మంత్రులు పిచ్చకుంట్ల పాట పాడుతూ కొండంత రాగం తీస్తున్నారని జూపల్లి ఎద్దేవా చేశారు.
"తెలంగాణ కోసం వాళ్లు ఢిల్లీకి వెళ్తామంటున్నారు. అక్కడికి వెళ్లి ఏం చేస్తారు ? మాటలు చెప్పటం కాదు..మంత్రాలకు చింతకాయలు రాలవు'' అని అన్నారు. తెలంగాణ మంత్రులు ఏమైనా చేసేది ఉంటే ఇక్కడే చేయాలని సవాల్ చేశారు.












Click it and Unblock the Notifications