'పంచాయతీ'కి హైకోర్టు గ్రీన్ సిగ్నల్: జగన్ పార్టీకి ఊపు

దీంతో జడ్పీటిసి, ఎంపిటీసి, సర్పంచ్‌ల ఎన్నికలకు మార్గం సుగమం అయింది. రిజర్వేషన్లు యాభై శాతం దాటకుండా నివేదిక రూపొందించాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. బిసీ రిజర్వేషన్లను కల్పించడంతో మొత్తం రిజర్వేషన్లు 60 శాతం దాకా అయ్యాయి. దీంతో రిజర్వేషన్లు యాభై శాతం దాటకుండా చూసి ఎన్నికల సంఘానికి ప్రక్రియ పూర్తయిన వెంటనే సమాచారం అందించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్థానిక సంస్థల గడువు ముగియడంతో స్థానిక సంస్థలు నిరుటి నుంచి ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్నాయి.
హైకోర్టు ఆదేశాలతో వైయస్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఉత్సాహం చోటు చేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చాలా కాలంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ డిమాండ్ చేస్తూ వస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి కాంగ్రెసు పార్టీ భయపడుతోందని విమర్సిస్తూ వస్తోంది. ఉప ఎన్నికల్లో సత్తా చాటిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ స్థానిక సంస్థల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా తన బలాన్ని కూడగట్టుకోవాలని, దాన్ని నిర్ధారించుకోవాలని చూస్తోంది.
కాగా, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తన సత్తా చాటడానికి పూనుకుంటుంది. తెలంగాణపై స్పష్టమైన వైఖరి వెల్లడించడం ద్వారా తెరాసను ఎదుర్కోవడానికి తెలుగుదేశం పార్టీ కూడా ముందుకు రావచ్చు. తెరాసను ఎదుర్కోవడానికి ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణలో పావులు కదుపుతూ వస్తోంది. కాంగ్రెసు పార్టీకి మాత్రం ఇది చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిని కల్పిస్తోంది.












Click it and Unblock the Notifications