జగన్‌పై పై'చేయి' కోసం: వైయస్ పాదయాత్రపై పుస్తకం

తద్వారా వైయస్ తమ వాడేనని వారు ప్రజల్లోకి తీసుకు వెళుతున్నారు. ఇందులో జగన్ విజయం సాధించారు కూడా. వైయస్ తొలి నుండి కాంగ్రెసులో ఉంటూ అదే పార్టీ నుండి ముఖ్యమంత్రిగా ఎదిగి మృతి చెందినప్పటికీ.. ఇప్పుడు ఆ పార్టీ నేతగా మెజార్టీ ప్రజలు చూడటం లేదు. జగన్ సొంత పార్టీ స్థాపించాక జగన్‌ను వైయస్‌ను వేరుగా చూడటం లేదు. అందుకు తగ్గట్టు ఆ పార్టీ నేతలు కూడా నిత్యం వైయస్‌తో కిరణ్ కుమార్ రెడ్డి పాలనను పోల్చుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. పథకాలపై ప్రశ్నలు వేస్తున్నారు. అంతేకాకుండా పార్టీ జెండాలో వైయస్ హయాం నాటి పథకాలను పొందుపర్చారు.
ఇలా వైయస్‌ను జగన్ తన సొంతం చేసుకోవడంతో ఓ సమయంలో పార్టీ వైయస్‌ను వైయస్సార్ కాంగ్రెసు పార్టీకే వదిలేద్దామనే నిర్ణయానికి దాదాపు వచ్చింది. అయితే వైయస్‌ను వదిలడం సరికాదని తాజాగా పార్టీ మరోసారి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఆయన మూడో వర్ధంతి సందర్భంగా కాంగ్రెసు నేతలు వైయస్‌కు కితాబిచ్చారు. కాంగ్రెసు వైయస్ బాటలోనే నడుస్తుందని, ఆయనను మర్చిపోదని చెప్పారు.
వైయస్ తమ వాడే అని చెప్పేందుకు కాంగ్రెసు మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగా కాంగ్రెసు అధికారంలోకి రావడానికి కారణమైన 2003 నాటి వైయస్ చరిత్రాత్మక పాదయాత్రపై ఓ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. ఇది సెప్టెంబర్ 7వ తేదిన న్యూఢిల్లీలోని ఆంధ్రా భవనంలో అంబేడ్కర్ ఆడిటోరియంలో జరగనుంది. ఈ కార్యక్రమానికి గులాం నబీ ఆజాద్ తదితర ఢిల్లీ స్థాయి నేతలతో పాటు కెవిపి రామచంద్ర రావు తదితరులు పాల్గొననున్నారు. కాగా ఈ పుస్తకంలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ సందేశం ఓ పేజీలో ఉండనుంది.












Click it and Unblock the Notifications