వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీ ఎదుట విమోచనం: కాసు విగ్రహం ధ్వంసం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Assembly Rowdy
హైదరాబాద్: సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎదుట సోమవారం జాతీయ జెండాను ఎగురవేసింది. ఈ సందర్భంగా బిజెపి నేతలు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. బిజెపి, తెలంగాణ రాష్ట్ర సమితి సహా పలువురు తెలంగాణ ప్రజా ప్రతినిధులు ఈ రోజు అసెంబ్లీకి జాతీయ జెండాలతో హాజరయ్యారు.

అంతకుముందు టిడిపి కార్యాలయంలో ఉదయం తెలంగాణ విలీనోత్సవాన్ని నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఎగరవేసి తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి దయాకర రావు, రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. హైదరాబాద్ సంస్థానం విలీనం కోసం ఎంతోమంది త్యాగాలు చేశారన్నారు.

ప్రభుత్వాన్ని తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని తెరాస ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఉదయం అసెంబ్లీ ఎదుట ఉన్న గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు నివాళులు అర్పించారు. అసెంబ్లీలో తీర్మానం వెంటనే ప్రవేశ పెట్టాలని, విద్యుత్ కోత, బోధనారుసుం తదితర సమస్యలపై మొద్దు నిద్ర వీడాలన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ కూడా గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించింది.

కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహం ధ్వంసం

కాగా సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం రోజున గుర్తు తెలియని దుండగులు హైదరాబాదులోని కెబిఆర్ పార్క్ వద్ద ఉన్న కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహాన్ని ఈ రోజు తెల్లవారు జామున ధ్వంసం చేశారు. అంతేకాకుండా విగ్రహంపై టైర్లు వేసి నిప్పు పెట్టారు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ధ్వంసమైన విగ్రహం కన్పించకుండా తెల్లని వస్త్రాన్ని చుట్టారు. సంఘటనా స్థలంలో తెలంగాణ జన ప్రతిఘటన పేరుతో కరపత్రాలు వదలి వెళ్లారు.

English summary
Unknown persons destroyed former CM Kasu Brahmananda Reddy's statue at KBR park in Hyderabad on Monday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X