DMK- AIADMK 118 సీట్లతో వస్తే వారికే ఛాన్స్, విజయ్ కు ఇక: గవర్నర్ సంచలనం..!!

తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం వేళ ఊహించని రాజకీయం తెర మీదకు వస్తోంది. విజయ్ పూర్తి మెజార్టీకి 118 సీట్లు అవసరం. ఇంకా ఆరు సీట్ల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మెజార్టీ చూపిస్తేనే ప్రభుత్వానికి ఆహ్వానిస్తానని గవర్నర్ తేల్చి చెబుతున్నారు. ఇదే సమయంలో DMK- AIADMK కలిసి కూటమిగా 118 సీట్ల సంఖ్యా బలం ఉంటే వారికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంద ని గవర్నర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

తమిళనాడు రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ 118 సభ్యుల మద్దతు నిరూపించాలనే మెలిక పెట్టారు. తాను అసెంబ్లీలో బల నిరూపన చేసుకుంటానని చెబుతున్నా.. గవర్నర్ ముందుగానే నెంబర్ స్పష్టం చేయాలని తేల్చేసారు. దీంతో.. అటు విజయ్ తనకు కావాల్సిన ఆరుగురు ఎమ్మెల్యే మద్దతు కోసం పార్టీలతో మంత్రాంగం కొనసాగిస్తున్నారు. అటు పరిణామాలను నిశితంగా గమనిస్తున్న డీఎంకే- అన్నా డీఎంకే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇటు కమ్యూనిస్టులు, డీఎంకే కూటమిలోని మరో రెండు పార్టీలతో విజయ్ సన్నిహితులు చర్చలు చేస్తున్నారు. ఈ రోజు వారి మద్దతు విషయం పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా.. అటు పళని స్వామి తన పార్టీలోని ఎమ్మెల్యేలతో వరుస భేటీ లు నిర్వహిస్తున్నారు. గవర్నర్ అప్పాయింట్ మెంట్ కోరారు. ఇదే సమయంలో గవర్నర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

గతం మర్చిపోయారా.. విజయ్ ప్రభుత్వ ఏర్పాటు పై విశాల్ సంచలనం..!!
గతం మర్చిపోయారా.. విజయ్ ప్రభుత్వ ఏర్పాటు పై విశాల్ సంచలనం..!!
tamil-nadu-governor-arlekar-made-it-clear-he-remains-open-to-any-formation-that-can-demonstrate-118

మారుతున్న సమీకరణాలు... కొత్త లెక్కలు

తమిళనాడు గవర్నర్ ఆర్లేకర్ ఒక టీవీ ఛానల్ తో కీలక వ్యాఖ్యలు చేసారు. విజయ్ 118 సభ్యుల మద్దతు పై రాత పూర్వకంగా స్పష్టత ఇచ్చినా చాలని.. తాను విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డు కాదని తేల్చి చెప్పారు. తాను 118 మందిని తన ఛాంబర్ కు పిలవటం లేదని క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో డీఎంకే- అన్నా డీఎంకే కలిసి 118 సీట్లతో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వస్తే ఆహ్వానిస్తారా అనే ప్రశ్నకు స్పందించారు. తప్పూ.. ఒప్పో వారికి మెజార్టీ ఉంటే వారికి మెజార్టీ ఉంది కాబట్టి... కాదనలేనని.. ఇది రాజ్యంగ ప్రక్రియగా గవర్నర్ పేర్కొన్నారు. మరో రెండు మూడు రోజుల్లో ఎవరూ మెజార్టీ నిరూపణ చేసుకోలేకపోతే.. తనకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాల పైన ముందుకు వెళ్తానని స్పష్టం చేసారు. విజయ్ ను సీఎంగా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించక పోవటం పైనా స్పందించారు. ఇధి విజయ్ ఒక్కరి సమస్య కాదని.. రాష్ట్రానికి సంబంధించిన అంశంగా చెప్పారు. దీంతో.. ఈ రోజు పొత్తులు.. లెక్కల పైన ఈ రోజున చోటు చేసుకునే పరిణామాలు మరింత ఉత్కంఠగా మారుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+