వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేనూ అందరిలాగే ఎదురుచూస్తున్నా: పదవిపై చిరంజీవి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
విశాఖపట్నం: తనకు ఇచ్చే పదవి కోసం తాను కూడా అందరిలాగే ఎదురు చూస్తున్నానని కాంగ్రెసు పార్టీ ముఖ్యనేత, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి సోమవారం అన్నారు. విశాఖపట్నంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ అధిష్టానం తనకు కేంద్రంలో ఏ పదవి ఇచ్చినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని చిరు చెప్పారు. పదవి విషయమై అందరిలాగే తాను కూడా ఎదురు చూస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు.

రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉండదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మారుస్తారనేది కేవలం ఊహాగానాలు మాత్రమే అన్నారు. మార్పు అంశాన్ని అధిష్టానం ఆలోచించడం లేదన్నారు. ముఖ్యమంత్రికి, మంత్రులకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని అన్నారు. అందరూ సమన్వయంతో పని చేస్తున్నారని చెప్పారు. పార్టీలో నాయకులకు, కార్యకర్తలకు మధ్య సమన్వయం ఉండాలని చెప్పారు.

కాగా చిరంజీవికి కేంద్రంలో మంత్రి పదవి వస్తుందని గత కొద్దికాలంగా ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. తిరుపతి శాసనసభ్యుడిగా ఉన్న చిరంజీవిని కేంద్రంలోకి తీసుకునేందుకే పార్టీ అధిష్టానం ఆయన ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయించి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. ఆయన రాజ్యసభ సభ్యుడు అయినప్పటి నుండి ఆయన మంత్రిపదవిపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అదిగో మంత్రివర్గ విస్తరణ, ఇదిగో మంత్రివర్గ విస్తరణ, ఈసారి చిరంజీవికి తప్పకుండా అవకాశం దక్కుతుందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు అతనికి కేంద్రమంత్రి పదవి రాలేదు. చిరును కేబినెట్లోకి తీసుకోక పోవడానికి పలు కారణాలు ఉన్నాయి. పార్టీ సీనియర్లు అడ్డుకోవడం, మంత్రివర్గ విస్తరణ జరగకపోవడం వంటి కారణాలు ఉన్నాయి.

English summary
Congress party leader and Rajyasabha Member Chiranjeevi said in Vishakapatnam that he is also waiting for cabinet post. He said there is no differences between CM Kiran Kumar Reddy and Ministers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X