చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భారత్‌కు ఇస్లాం వ్యతిరేక సినిమా చిచ్చు: భారీ భద్రత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Tamilnadu Map
చెన్నై: ఇస్లాం వ్యతిరేక సినిమా చిచ్చు భారత్‌కు కూడా పాకింది. ఈ సినిమా చిచ్చు రెండు రోజుల క్రితమే మన దేశానికి పాకినప్పటికీ మంగళవారం ముస్లిం సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని నిర్ణయించుకున్నాయి. తమిళనాడులోని వివిధ ముస్లిం సంఘాలు యాంటీ ముస్లిం సినిమాపై మండిపడుతున్నాయి. ఈ సినిమాకు వ్యతిరేకంగా రేపు భారీ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. చెన్నైలోని అమెరికా ఎంబసీని ముట్టడించాలని 25 తమిళ ముస్లిం సంఘాలు ఈ రోజు పిలుపునిచ్చాయి.

ముస్లిం సంఘాలు పిలుపుతో జయలలిత సర్కారు వెంటనే అప్రమత్తమైంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు రాజధానిలో భారీ భద్రతను ఏర్పాటు చేసింది. ముస్లిం సంఘాలు ముట్టడిస్తామని హెచ్చరించిన యుఎస్ ఎంబసీ వద్ద దాదాపు వెయ్యి మంది పోలీసులతో గట్టి పహారాను ప్రభుత్వం ఉంచింది.

అంతకుముందు ముస్లిం సంఘాలు భేటీ అయి అమెరికన్ చిత్రం ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని, ఈ సినిమాను ప్రతి ఒక్కరూ నిషేధించాలని డిమాండ్ చేశారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ముస్లిం వ్యతిరేకి అని, ఆరోపిస్తూ అతని దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారి చర్యలను అడ్డుకున్నారు. ముస్లిం సంఘాలు యుఎస్ ఎంబసీ ముట్టడికి పిలుపునివ్వడంతో రెండు రోజుల పాటు వీసా దరఖాస్తులను నిలుపుదల చేశారు.

కాగా ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఓ చిత్రం విడుదలయిందని ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఆందోళనలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. చిత్రాన్ని వ్యతిరేకిస్తూ లిబియాలోని అమెరికా కాన్సులేట్ పై ఆందోళనకారులు గత వారం దాడి చేశారు. ఈ దాడిలో ఓ అమెరికన్ అధికారి మృతి చెందాడు. ఆ తర్వాత ట్యునీషియాకు కూడా సినిమా చిచ్చు పాకింది.

English summary
Faced with protests over the anti-Islam film for the third day, the US consulate here has shut down its visa section for two days from Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X