మీరు చెప్తే తెలుసుకుంటా: తెలంగాణపై నరసింహన్

Narasimhan
చిత్తూరు: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చినప్పుడు దగ్గర్లోని ఆలయాలను ఎలా దర్శించుకుంటామో.. న్యూఢిల్లీ వెళ్లినప్పుడు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, కేంద్రమంత్రులు నారాయణ స్వామి, అహ్మద్ పటేల్, సుశీల్ కుమార్ షిండే, చిదంబరం తదితరులను అలాగే కలుస్తానని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ శనివారం అన్నారు. ఆయన తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. తన ఢిల్లీ పర్యటనలో ఎలాంటి ప్రత్యేకత, ప్రాధాన్యం లేదన్నారు. ఇది సాధారణ పర్యటన అని చెప్పారు. ప్రతిసారి ఢిల్లీ పర్యటనను ప్రత్యేకంగా చూడటం సరికాదని మీడియాకు హితబోధ చేశారు. తెలంగాణ సంకేతాల గురించి తనకు తెలియవని, మీడియా చెబితే తెలుసుకుంటానని చెప్పారు. రాష్ట్రం ప్రశాంతంగా, సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఆయన చెప్పారు. తన ఢిల్లీ పర్యటన కూల్‌గా జరిగిందన్నారు.

కాగా తెలంగాణ మార్చ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం ఉండదని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ శుక్రవారం ఢిల్లీలో చెప్పిన విషయం తెలిసిందే. ఆయన న్యూఢిల్లీలో బిజిబిజిగా గడిపారు. పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంతో ఆయన శుక్రవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయాలు, తెలంగాణ మార్చ్ తదితర అంశాలపై చిదంబరంతో నరసింహన్ చర్చించారు.

అంతకుముందు నరసింహన్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ మార్చ్ విషయంలో ఢిల్లీ స్థాయిలో జోక్యం ఉండదన్నారు. అది రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుందని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల స్తంభనపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. తాను కేంద్రమంత్రి నారాయణ స్వామితో తదుపరి భేటీ అవుతానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+