ధర్మాన: కోర్టు వద్ద మోపిదేవి అనుచరుల హల్‌చల్

ధర్మానకు ఓ న్యాయం మోపిదేవికి ఓ న్యాయమా అంటూ వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మోపిదేవి విషయంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని, అందుకే ఆయన జైలుకు వెళ్లవలసిన పరిస్థితి వచ్చిందన్నారు. మోపిదేవి తన నిజాయితిని నిరూపించుకొని జైలు నుండి బయటకు వస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. మోపిదేవి ఎలాంటి తప్పు చేయలేదని, కేబినెట్ ఆమోదం మేరకే ఆయన జీవోలు జారీ చేశారన్నారు.
మోపిదేవికి త్వరలో బెయిల్ వస్తుందన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్కడ హల్ చల్ చేస్తుండటంతో పోలీసులు మోపిదేవి అనుచరులను చెదరగొట్టారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో వాన్‌పిక్‌కు భూములు కేటాయించిన సమయంలో ధర్మాన రెవెన్యూ శాఖ మంత్రిగా ఉండగా, మోపిదేవి మౌళిక వసతుల పెట్టుబడుల మంత్రిగా ఉన్నారు.
తన అనుచరులు ఆందోళన చేసే సమయానికి మోపిదేవి వెంకటరమణను కోర్టు నుండి జైలుకు తరలించారు. అయితే ధర్మాన ప్రసాద రావు మాత్రం కోర్టు ప్రాంగణంలోనే ఉన్నారు. అనంతరం ఆయన మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని తన నివాసానికి వెళ్లారు.












Click it and Unblock the Notifications