ఐఎంజి కేసులో చంద్రబాబు ఇరుక్కుంటారా?

ధర్మాసనం ఆదేశిస్తే 'ఐఎంజీ భారత' సంస్థకు భూ కేటాయింపుల్లో అక్రమాలపై ప్రాథమిక విచారణ చేస్తామని సిబిఐ తెలిపిన నేపథ్యంలో ఎర్రంనాయుడు ఆ మాటలు అన్నారు. ఆ విషయం తెలియజేస్తూ సోమవారం హైకోర్టులో సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. ఐఎంజీ భారత సంస్థకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నగర శివార్లలోని అత్యంత ఖరీదైన భూములను కారుచౌకగా కట్టబెట్టిందని ఆరోపిస్తూ న్యాయవాది శ్రీరంగరావు, ప్రముఖ పాత్రికేయులు ఎబికె ప్రసాద్, ఆడిటర్ విజయసాయిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.
వీటిని సోమవారం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్, జస్టిస్ అఫ్జల్ పుర్కర్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఐఎంజీ భారత సంస్థ కుదుర్చుకున్న ఒప్పందంలోని అక్రమాలపై ప్రాథమిక విచారణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం 2006లో జీవో 310ను జారీ చేసిందని, అంతకుముందే ఔటర్ రింగ్‌రోడ్ భూసేకరణలో అక్రమాలపైనా ప్రాథమిక విచారణ కోరిందని కోర్టుకు సిబిఐ తెలిపింది.
తగిన సిబ్బంది లేకపోవడంతో ఐఎంజీ వ్యవహారంపై రాష్ట్రస్థాయి దర్యాప్తు అధికారులతోనే ప్రాథమిక విచారణ చేయించాలని, ఆధారాలు లభిస్తే సీబీఐ విచారణను కోరాలని రాసిన లేఖపై ఇంతవరకు ఎలాంటి సమాధానం రాలేదని తెలిపింది. ప్రస్తుతం తాము దర్యాప్తు చేస్తున్న కేసులన్నీ ఓ కొలిక్కి వచ్చాయని, సిబ్బంది కొరత సమస్య ఉండే పరిస్థితి లేదని సిబిఐ కోర్టుకు తెలిపింది. తాజాగా సీబీఐ కౌంటర్‌ను పరిశీలించిన ధర్మాసనం విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications