బైక్ కోసం బాలుడిని హత్య చేసిన కాలేజీ విద్యార్థి

హత్య చేసిన టీనేజర్‌ను హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థి పర్మీందర్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఘాతుకం మహారాష్ట్రలోని పూణేలో జరిగింది. పర్మీందర్ శుభ్ రావల్ అనే పిల్లాడిని ఆదివారం ఉదయం కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత కొద్ది గంటలకే అతన్ని చంపేశాడు.
ఆదివారం ఉదయం డెఫెన్స్ సైంటిస్ట్ కుమారుడు శుభ్ వినాయకుడి మండపం వద్ద ఆడుకుంటున్నాడు. చాక్‌లెట్ ఇస్తానని ఆశపెట్టి సమీపంలోని ఆడవిలోకి శుభ్‌ను పర్మీందర్ తీసుకుని వెళ్లాడు. తండ్రి ఫోన్ నెంబర్ ఇవ్వాలని అతను శుభ్‌ను అడిగాడు. ఆ పిల్లాడు నిరాకరించాడు.
శుభ్ తండ్రి ఫోన్ నెంబర్ తీసుకుని ఐదు లక్షలు డిమాండ్ చేయాలని పర్మీందర్ అనుకున్నాడు. శుభ్ మొండికేయడంతో అతన్ని అతన్ని ఉరేసి చంపేశాడు. ఈ వ్యవహారంలో పర్మీందర్‌కు ఓ పదో తరగతి విద్యార్థి సహకరించాడు. పోలీసులు పర్మీందర్‌ను, అతనికి సహకరించిన బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications