తెలంగాణపై వెనక్కి: ప్రకటన ఉండదన్న వాయలార్ రవి

తెలంగాణ ఎక్కడుందని ఆయన ఏకంగా ప్రశ్నించారు. తెలంగాణపై తాము ఆలోచించడం లేదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. తెలంగాణపై ఇప్పట్లో ప్రకటన ఉండదని స్పష్టం చేశారు. కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశంలో సమావేశంలో తెలంగాణపై చర్చించలేదని స్పష్టం చేశారు. అధిష్టానం జాతీయ అంశాలతోనే బిజీగా ఉందని, తెలంగాణపై ఆలోచన చేయడం లేదని అన్నారు.
కాంగ్రెసులో తెరాస విలీనంపై ప్రశ్నించగా, ఆ విషయం తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావునే అడగాలని వాయలార్ రవి చెప్పారు. ఈ నెల 30వ తేదీన తెలంగాణ మార్చ్ ఉందని, హింస ప్రజ్వరిల్లవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని మీడియా ప్రతినిధులు అన్నప్పుడు ఆయన అదో రకంగా పెదవి విరిచారు. కెసిఆర్ తనను కలిశారని, తెరాస విలీనం విషయం పెద్ద విషయమని ఆయన అన్నారు.
తాను తెలంగాణపై కెసిఆర్‌తో చర్చలు జరుపుతున్నట్లు గతంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో వెల్లడించిన వాయలార్ రవి ఏకంగా అదేమిటో తెలియదన్నట్లు మాట్లాడారు. నేడో రేపో కెసిఆర్ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుస్తారని కూడా వార్తలు వెలువడ్డాయి. మొత్తం మీద, అందరి అనుమానాలను నిజం చేస్తూ కాంగ్రెసు అధిష్టానం వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications