palvai goverdhan reddy telangana ghulam nabi azad congress పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తెలంగాణ గులాం నబీ ఆజాద్ కాంగ్రెసు
అక్టోబర్‌లో తెలంగాణ, వైయస్‌ను నమ్మి...: పాల్వాయి

త్వరలోనే తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉందని, కానీ, పరిస్థితుల ప్రభావంతో ఆలస్యం జరుగుతోందని, ఎవ్వరూ తెలంగాణ వద్దు అనలేదని, కాకపోతే యూపి ప్రభుత్వం రాజకీయ సమస్యలు ఎదుర్కొంటోందని, దానివల్లే కేబినెట్ విస్తరణా ఆలస్యమవుతోందన్నారు. కేంద్రం వద్ద సమస్యలన్నీ కొలిక్కి వచ్చాక తెలంగాణ ప్రకటిస్తారని చెప్పారు. తెలంగాణ మంత్రులకూ ధైర్యం వచ్చిందని, ముఖ్యమంత్రితో పోరాడి మార్చ్‌కు అనుమతి సాధించారని ప్రశంసించారు.
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి మాట విని జైలుకు పోయిందంతా ఆంధ్రావాళ్లేనని, తెలంగాణ వారికి సంపాదించుకోవటం తెలియదని, జైలుకెళ్లటం కూడా తెలియదని ఆయన అన్నారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి, అది బిల్లు ఆమోదం పొందేవరకూ తెలంగాణపై కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మరాదని తెరాస పొలిట్‌బ్యూరో సభ్యుడు వినోద్‌కుమార్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ పట్ల కాంగ్రెస్ పార్టీది తొలి నుంచీ ద్రోహ చరిత్రేనని విమర్శించారు.
1956లో ఆంధ్రా-తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు ప్రవేశ పెట్టారని, బిల్లు ఆమోదం పొందే సరికి తెలంగాణ పదం ఎగిరిపోయిందన్నారు. ఆ స్థానంలో ప్రదేశ్ వచ్చి చేరిందని, బిల్లు పెట్టిన తర్వాత కూడా కుట్రలు చేశారని, పేర్లు మార్చేలా ఆంధ్రా నాయకులు పన్నాగం చేశారని, వీటన్నింటి దృష్ట్యా పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందే వరకూ అప్రమత్తంగానే ఉండాలని కోరారు.