టెక్కీకి లైంగిక వేధింపు: ఐఏఎస్ అరెస్ట్, 14రోజులు జైలు

 IAS officer accused of molesting woman sent to jail
లక్నో: ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(ఐఏఎస్) అధికారి ఒకరు ఓ మహిళపై అత్యాచారయత్నం చేశారనే కేసులో అరెస్టయ్యారు. అతనికి కోర్టు రెండు వారాల పాటు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు అధికారిణి అరెస్టు చేశారు. గూగుల్ ఇండియా ఎక్జిక్యూటివ్ అయిన ఓ యువతి లక్నో నుండి న్యూఢిల్లీ వెళుతున్న సమయంలో ఐఏఎస్ అధికారి శశి భూషణ్ లాల్ సుశీల్ ఆమెను లైంగికంగా వేధించాడు.

టెక్నికల్ ఎడ్యూకేషన్ డిపార్టుమెంట్‌లో ప్రత్యేక కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న శశి భూషణ్ ప్రయాణంలో తనతో మిస్ బిహేవ్ చేశారని ఆమె ఆరోపించారు. ఇతను ఘాజీయాబాద్‌లో రైలు ఎక్కారని, అక్కడి నుండి తనను వేధించారని, ఉద్దేశ్య పూర్వకంగా ముట్టుకునే ప్రయత్నాలు చేశారని బాధితురాలు ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు లక్నో రైల్వే పోలీసులు శశి భూషణ్ పైన కేసు నమోదు చేశారు.

కాగా ఐటి ఎగ్జిక్యూటివ్ అయిన మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేయడం, రిమాండుకు తరలించడంతో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం శశి భూషణ్‌ను విధుల నుండి తప్పించింది. అయితే శశి భూషణ్ మాత్రం లైంగిక ఆరోపణలను ఖండించారు. ఆ మహిళ కులపరమైన వ్యాఖ్యలు చేయడంతో ఆమెతో వాగ్వాదం జరిగిందని చెప్పారు. తాను ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదని తెలిపారు. కాగా ఆదివారం రాత్రి ప్రయాణిస్తున్న సమయంలో అసభ్యంగా ప్రవర్తించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. పోలీసులు అతనిని సోమవారం అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+