భార్య పాతబడితే అంతే, అందం కూడా: మంత్రి వ్యాఖ్య

కాన్పూర్‌లో ఆదివారం జరిగిన కవి సమ్మేళనం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మహిళా సంఘాలతో పాటు ప్రతిపక్షాలు కూడా మంత్రి వ్యాఖ్యలపై మండిపడ్డాయి. దేశవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తడంతో.. చివరకు మంత్రిగారు యథాప్రకారం తన మాటలను మీడియా వక్రీకరించిందని చెప్పి, ఆ పై క్షమాపణలు కూడా చెప్పుకొన్నారు. ఆయన కాన్పూర్‌లో ఒక సమ్మేళనానికి హాజరై ప్రసంగిస్తుండగా.. ట్వంటీ 20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ గెలిచినట్లు వార్త తెలిసింది.
దీంతో సభలో ఉన్నవారంతా హర్షం వ్యక్తం చేయగా, విజయం కొత్తదైతేనే సంబరం ఉంటుందని చెబుతూ.. భార్యలపై వ్యాఖ్యలు చేశారు. దీంతో మహిళా సంఘాల వారు ఆయన స్వస్థలమైన కాన్పూర్‌లో పోస్టర్ల మీద నల్లరంగు పూసి.. ఆయన దిష్టిబొమ్మలు కూడా దహనం చేశారు. జైస్వాల్‌ను కేబినెట్‌లో ఎలా కొనసాగిస్తారని బిజెపి ప్రశ్నించింది. ఆయన వ్యాఖ్యలు చాలా అవమానకరంగా ఉన్నాయని జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ మమతా శర్మ అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి ఓ మహిళ నేతృత్వం వహిస్తున్నారని, అయినా ఆమె ఇలాంటి ఫ్యూడల్ భావజాలం ఉన్న వ్యక్తిని మంత్రివర్గంలో కొనసాగించడం ఎంతవరకు సమంజసమని బీజేపీ అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. ఆ పార్టీ మహిళా విభాగం అధినేత్రి స్మృతి ఇరానీ కూడా మండిపడ్డారు. అయితే, ఇప్పటికే జైస్వాల్ క్షమాపణలు చెప్పారు కాబట్టి ఇక ఆ విషయం ఇంతటితో ముగిసిందని కాంగ్రెస్ ప్రతినిధి మనీష్ తివారీ అన్నారు.












Click it and Unblock the Notifications