హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోటాపోటీ: కత్తులు నూరుకుంటున్నసిఎం, వివేక్ క్యాంప్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy - Vivek
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు వివేక్ వర్గాలు ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటున్నాయి. గత నెల 30న జరిగిన కవాతు, తదనంతర పరిణామాల నేపథ్యంలో కిరణ్, వివేక్ మధ్య తీవ్ర విభేదాలు పొడసూపిన విషయం తెలిసిందే. దీంతో ఆ రెండు వర్గాలు ఒకరిపై మరొకరు పై చేయి సాధించేందుకు ఎత్తులు, పైఎత్తులు వేస్తున్నాయి. ముఖ్యమంత్రి పట్ల వివేక్ ప్రదర్సించిన వైఖరి పట్ల కిరణ్ వర్గం రగులుతోంది.

వివేక్‌కు వ్యతిరేకంగా కరీంనగర్, అదిలాబాద్ జిల్లాల నేతలు ఏకతాటి పైకి వస్తున్నారట. వివేక్‌కు వ్యతిరేకంగా సిఎం వర్గం నేత, శాసనమండలి సభ్యుడు ప్రేమ్ సాగర రావు నేతలను ఒక్క తాటి పైకి తీసుకు వస్తున్నారు. ఆయన ఈ రోజు సాయంత్రం వివేక్ సొంత జిల్లా కరీంనగర్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో వారు పెద్దపల్లి నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిపై ప్రశ్నించనున్నారని సమాచారం. తెలంగాణ అంశాన్ని కూడా వివేక్‌పై సంధించనున్నారట.

ఇప్పటికే పలువురు నేతలు ఎంపీలు తెలంగాణ కోసం చిత్తశుద్ధిగా ఉద్యమించే వారే అయితే వారు ఢిల్లీలో వెళ్లి అధిష్టానం వద్ద నిరసన తెలపాలని, హైదరాబాదులో కాదని సూచించారు. అయితే వివేక్ వర్గం కూడా తక్కువేమీ తినలేదంటున్నారు. వారు కూడా పోటా పోటీ మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

సమన్వయానికి కృషి... పొంగులేటి

ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రాంత ఎంపీల మధ్య కొంత గ్యాప్ వచ్చిన మాట వాస్తవమేనని పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. ఇరువర్గాల మధ్య తాము సమన్వయానికి కృషి చేస్తామన్నారు. కూర్చునే కొమ్మనే నరుక్కునే ప్రయత్నాలు ఎవరు చేసిన సరికాదన్నారు. చెట్టెక్కి కూర్చున్న వారు పార్టీని దెబ్బతీసే ప్రయత్నాలు చేయవద్దన్నారు. ఎంపీలకు ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదన్నారు.

English summary

 CM Kiran Kumar Reddy camp and Karimnagar district Peddpalli MP Vivek camp leaders are trying to press meet in Karimnagar district on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X