విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ తెలంగాణదే: ఆంధ్ర జెఎసి, ఎంపిలపై ఫైర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
విజయవాడ: కోస్తాంధ్ర ప్రాంతంలో సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా గొంతు పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వర రావు నాయకత్వంలోని జై ఆంధ్ర ఉద్యమం ఊపందుకున్నట్లు కనిపిస్తోంది. తాజాగా, ఆంధ్ర జెఎసి చేసిన ప్రకటన ఆ విషయాలను తెలియజేస్తోంది. కోస్తాంధ్ర కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు హైదరాబాదుపై చేస్తున్న ప్రకటనలను ఆంధ్ర జెఎసి చైర్మన్ సుంకర కృష్ణమూర్తి ఖండించారు.

తెలంగాణ ప్రాంతానికి గుండెకాయ వంటి హైదరాబాద్‌పై సీమాంధ్ర ప్రాంతానికి ఎలాంటి హక్కు లేదని సుంకర కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు. ఆ విషయంపై ఆయన విజయవాడలో మాట్లాడారు. సీమాంధ్ర కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్, కావూరి సాంబశివరావు, రాయపాటి సాంబశివ రావులు బాధ్యతారహితంగా హైదరాబాద్‌పై వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ పక్కాగా తెలంగాణ ప్రాంతానికి చెందిందేనని, దానిపై సీమాంధ్రులకు ఎలాంటి హక్కు లేదన్నారు. తెలంగాణ ప్రాంతానికి హైదరాబాద్ గుండెకాయ వంటిదన్నారు. ఆంధ్ర, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలుంటే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే ప్రత్యేక రాజధాని, ప్రభుత్వ కార్యాలయాలు వస్తాయని, దీంతో ఆంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు హైదరాబాదును అడ్డుగా సీమాంధ్ర నాయకులు చూపుతున్నారు. హైదరాబాద్‌ను తాము అభివృద్ధి చేశామని చెబుతున్నారు. ఈ తరుణంలో సుంకర కృష్ణమూర్తి ప్రకటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

English summary
Andhra JAC chairman Sunkara Krishna Murthy saif that Hyderabad is a part on parcel of Telangana. He condemned Andhra MPs claim on Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X