రేణుకా చౌదరికి చేదు అనుభవం: కసురుకున్న ఎంపి

బుధవారం సాయంత్రం 6.15 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న రేణుకా చౌదరి దేశీయ టెర్మినల్ నుంచి బయుటకు వస్తుండగా తెలంగాణవాదులు, తెరాస నాయకులు ఒక్కసారిగా జై తెలంగాణ అంటూ నినాదాలు చేయుడంతో పాటు రేణుకా చౌదరి డౌన్ డౌన్.. తెలంగాణ ద్రోహి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో రేణుకా చౌదరి కూడా ఒకింత ఆగ్రహంతో జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. నేనూ తెలంగాణ వాదినే.. ఎందుకరుస్తున్నారని కసురుకున్నారు. పరుషపదజాలం వారిపై ఉపయోగించి అక్కడ నుండి వెళ్లిపోయారు.
సిఎంపై అభాండాలు వద్దు... రాయపాటి
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు అభాండాలు వేయడం తగదని గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు చిత్తూరు జిల్లాలో హితవు పలికారు. శ్రీవారి దర్శనార్థం తిరుమల వచ్చిన ఆయన బుధవారం రాత్రి ఆలయం ముందు విలేకరులతో మాట్లాడారు.
ఎంపీలను కించపరిచారంటూ సభాహక్కుల ఉల్లంఘన కింద పార్లమెంటులో సీఎంపై చర్యలు కోరతామనడం సరికాదన్నారు. తనపై తెలంగాణ ఎంపీలు అసభ్యంగా మాట్లాడుతున్నారని, అందుకని సమైక్యాంధ్ర గురించి తాను మాట్లాడదలుచుకోలేదని రాయపాటి పేర్కొన్నారు. ఏదైనా ఉంటే ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాతే స్పందిస్తానన్నారు.












Click it and Unblock the Notifications