• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

యడ్డీ కొత్త కుంపటి: ములాయంసింగ్ ఎస్పీలో చేరతారా?

By Srinivas
|

Yeddyurappa
బెంగళూరు: కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత యడ్యూరప్ప ఆ పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో నాలుగు దశాబ్దాల పాటు నిరంతర పోరాటాలతో అధికార పీఠం సాధించిన యడ్యూరప్ప ఇక ఆ పార్టీకి దూరం కానున్నారు. డిసెంబర్ మొదటి వారంలోనే ఆయన కొత్త పార్టీని లాంఛనంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ కొత్త పార్టీకి కర్ణాటక జనతా పార్టీగా నామకరణం చేసి రిజిస్టర్ చేయించే సన్నాహాలు కూడా జరుగుతున్నాట్లుగా సమాచారం.

పార్టీ పేరు ప్రకటించిన రోజునే ఆయన వందకు పైగా శాసనసభా నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటిస్తారట. చిక్కమగళూరు జిల్లాకు బుధవారం వచ్చిన యడ్యూరప్ప స్థానిక బిజెపి నేతలతో పాటు ఇతర పార్టీలకు చెందిన లింగాయత్ నేతలతో రహస్య మంతనాలు జరిపారు. జిల్లాకు చెందిన నలుగురు బిజెపి ఎమ్మెల్యేలు యడ్యూరప్పతో చేతులు కలిపేందుకు అంగీకరించినట్లు సమాచారం.

కాగా యడ్యూరప్ప గత కొంతకాలంగా బిజెపి అధిష్టానంపై గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. మైనింగ్ ఆరోపణలతో ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకోవాల్సి వచ్చింది. పదవికి రాజీనామా చేసేందుకు ససేమీరా అన్న యడ్డీపై అధిష్టానం ఒత్తిడి తీసుకు వచ్చి రాజీనామా చేయించింది. అయితే ఆయన సూచించిన సదానంద గౌడకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించింది. అయితే ఆ తర్వాత సదానందతోనూ యడ్డీకి పడలేదు.

దీంతో సదానందను పీఠం నుండి దింపాలని ఆయన పట్టుబట్టారు. ఎట్టకేలకు ఆయన తన పట్టును నెగ్గించుకొని జగదీష్ శెట్టార్ పేరును సూచించారు. తాను సిఎం పదవికి రాజీనామా చేసిన సమయంలోనే ఆరు నెలల్లో తిరిగి తాను సిఎంను అవుతానని చెప్పారు. అందుకు బిజెపి కూడా అంగీకరించిందని ఆయన అప్పుడు చెప్పారు. కానీ అధిష్టానం ఒప్పుకోవడం లేదు. దీంతో అసంతృప్తికి లోనైన అతను పార్టీని వీడి కొత్త పార్టీని పెట్టాలని భావిస్తున్నారట.

ములాయం పార్టీలో చేరతారనే వాదనలూ...

ఓవైపు యడ్డీ కొత్త పార్టీ పెడతారనే వార్తలు వస్తున్నప్పటికీ మరోవైపు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ములాయం సింగ్ ఆధ్వర్యంలోని సమాజ్ వాది పార్టీలో కూడా చేరతారనే చర్చ కూడా రాజకీయా వర్గాల్లో జోరుగా సాగుతోంది. బిజెపికి రాజీనామా చేసే రోజునే ఆయన ఎస్పీలో చేరతారని అంటున్నారు. యడ్డీకి చెందిన నేతలు పలువురు ఇప్పటికే రెండుసార్లు ములాయంతో భేటీ అయి యడ్డీ చేరికపై చర్చించారని తెలుస్తోంది. అయితే చర్చలు ఇంకా పూర్తవలేదు.

యడ్యూరప్ప ఎస్పీలో చేరే వార్తల్ని తోసి పుచ్చలేమని, అయితే ములాయం సింగ్‌తో యడ్డీ మాట్లాడిన అనంతరం ఏ విషయమనేది తేలుతుందని, అప్పుడే తేలేది కాదని యడ్డీకి దగ్గరగా ఉండే ఓ నేత వ్యాఖ్యానించారు. మరోవైపు యడ్యూరప్ప మాత్రం తాను ఎస్పీలో చేరే విషయంపై పెదవి మెదపటం లేదు.

English summary
Putting an end to speculations over his nest move, BJP leader and former chief minister BS Yeddyurappa on Wednesday said he would quit BJP by December and not join any other political outfit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X