విద్యుత్తుపై అధికారులకు ముఖ్యమంత్రి క్లాస్

Kiran Kumar Reddy
హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్తు పరిస్థితి మరో వారం రోజుల్లో మెరుగు పడుతుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. విద్యుదుత్పత్తి, సరఫరా, బొగ్గు లభ్యతలపై ఆయన శుక్రవారం సచివాలయంలో ఇంధన శాఖ ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షించారు. విద్యుత్తు కొనుగోలుకు, రీలిక్విఫైడ్ సహజవాయువు దిగుమతికి వారం రోజుల్లో 600 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

రైతులకు ఏడు గంటలు విద్యుత్తు విధిగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఎన్టిపిసికి బొగ్గు సరఫరాను మెరుగుపరిచేందుకు తగిన చర్యలు తీసుకునే విధంగా కోల్ ఇండియా లిమిటెడ్‌కు ముఖ్యమంత్రి లేఖ రాశారు. వ్యవసాయానికి విధిగా ఏడు గంటలు విద్యుత్తు సరఫరా చేయాలని, డిమాండ్ మేరకు విద్యుత్తును కొనుగోలు చేయాలని ఆయన అధికారులకు సూచించారు.

రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాపై, సేకరణపై ముఖ్యమంత్రి అధికారులకు క్లాస్ తీసుకున్నారు. విద్యుత్తు కోసం వివిధ ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని సూచించారు. గ్రామాల్లోకి వెళ్లి పరిస్థితిని ప్రత్యక్షంగా సమీక్షించాలని చెప్పారు. క్షేత్రస్థాయిలో విద్యుత్తు పరిస్థితి బాగా లేదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అధికారులపై ఆయన ఆగ్రహం కూడా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

వ్యవసాయానికి ఏడు గంటల పాటు విద్యుత్తు సరిగా అందడం లేదని, పరిస్థితిని మెరుగుపరచాల్సిన అవసరం ఉందని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో తీవ్రమైన విద్యుత్ కోత అమలవుతోంది. వర్షాలు సరిగా పడకపోవడంతో జలశయాలు అడుగంటి పోయి జల విద్యుత్తు ఉత్పత్రి సరిగా జరగడం లేదు. కరెంట్ కష్టాలు మాత్రం రాష్ట్రంలో తీవ్రంగానే ఉన్నాయి. ఈ స్థితిలో పరిస్థితి ముఖ్యమంత్రి సమీక్షించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+