అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజకీయాల్లోకి మరో యువనేత: పరిటాల శ్రీరామ్ రెడీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Paritala Sriram
అనంతపురం: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా.. మీకోసం పాదయాత్ర మరో యువ నేతను కూడా రాజకీయాల్లో క్రియాశీలకం చేయబోతోంది. ఇప్పటి వరకు తెరవెనకే ఉంటూ వస్తున్న దివంగత నేత పరిటాల రవి, రాప్తాడు తెలుగుదేశం పార్టీ శానససభ్యురాలు పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించబోతున్నట్లు అర్థమవుతోంది. చంద్రబాబు పాదయాత్రలో ఆయన చురుగ్గా కనిపించారు. రాప్తాడు నియోజకవర్గంలో చంద్రబాబు వెంట పరిటాల సునీతతో పాటు పరిటాల శ్రీరామ్ కూడా ఉన్నారు. పైగా, యువకుల నుంచి పరిటాల శ్రీరామ్‌కు ఆహ్వానం కూడా అందుతోంది.

పరిటాల శ్రీరామ్‌ పార్టీలో చురుకైన పాత్ర నిర్వహించే విధంగా చూసేందుకు చంద్రబాబు కూడా సిద్ధపడినట్లు అర్థమవుతోంది. పరిటాల శ్రీరామ్ మాట్లాడాలని అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం తిమ్మాపురంలో చంద్రబాబు ప్రసంగిచిన తర్వాత కార్యకర్తలు అడిగారు. దానికి చంద్రబాబు ప్రతిస్పందిస్తూ - శ్రీరామ్ మాట్లాడడమే కాదు, నాయకత్వం వహిస్తాడని చంద్రబాబు అన్నారు. దీన్ని బట్టి శ్రీరామ్ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తాడనేది అర్థమవుతోంది.

దివంగత తెలుగుదేశం పార్టీ నాయకుడు పరిటాల రవి పెద్ద కుమారుడు పరిటాల శ్రీరామ్ రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమైనట్లు ఈ ఏడాది జనవరిలో ప్రచారం సాగింది. అనంతపురంలోని తన నివాసంలో అప్పట్లో ఆయన రాప్తాడు, అనంతపురం శాసనసభా నియోజకవర్గాలకు చెందిన పరిటాల అభిమానులతో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. పరిటాల రవి వర్ధంతి కార్యక్రమంపై ఆయన వారితో చర్చించారు.

ఇక నుంచి పరిటాల రవి ట్రస్టు నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో తాను ముందు ఉంటానని శ్రీరామ్ అప్పట్లో చెప్పారు. రాజకీయం పెద్దలు చూసుకుంటారని, రాజకీయం గురించి మాట్లాడే వయస్సు తనకు లేదని శ్రీరామ్ అన్నప్పటికీ భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో ఉంచుకునే ఆయన క్రియాశీలకంగా ముందుకు వస్తున్నట్లు ప్రచారం సాగింది..

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి సూచన మీద, అభిమానుల కోరిక మీద శ్రీరామ్ రాజకీయ రంగ ప్రవేశం ఆధారపడి ఉంటుందని పార్టీ శాసనసభ్యురాలు, పరిటాల శ్రీరామ్ తల్లి పరిటాల సునీత చెప్పారు. పరిటాల ట్రస్టు సేవా కార్యక్రమాలకు మాత్రం ప్రస్తుతానికి శ్రీరామ్ నేతృత్వం వహిస్తారని ఆమె చెప్పారు. రాజకీయాల గురించి మాట్లాడే సయమం కాదంటూనే ఆమె శ్రీరామ్ భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారనే సూచనను అందించారు. 2014 ఎన్నికల నాటికి ఆయన రాజకీయాల్లోకి రావచ్చునని అప్పుడు ప్రచారం సాగింది.

అందుకు తగిన విధంగానే శ్రీరామ్ రాజకీయ రంగ ప్రవేశం ఇప్పుడు జరుగుతోందని అంటున్నారు. చంద్రబాబు కూడా శ్రీరామ్ క్రియాశీలక పాత్రకు పచ్చ జెండా ఊపారు. వచ్చే ఎన్నికల లోగానే శ్రీరామ్ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించడానికి ముందుకు వస్తారని అంటున్నారు.

అనంతపురం జిల్లాలో కాంగ్రెసుకు ప్రత్యామ్నాయంగా పరిటాల రవి కుటుంబం ఉంటూ వస్తోంది. తెలుగుదేశం పార్టీకి పరిటాల రవి మొదటి నుంచి బలాన్ని సమకూరుస్తూ వచ్చారు. ఇప్పుడు తన ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కోవడానికి పరిటాల శ్రీరామ్ రాజకీయాల్లోకి రావడానికి సిద్ధపడినట్లు సమాచారం.

English summary
Paritala Sriram, son of Late Paritala Ravi and Rapthadu Telugudesam MLA Paritala Sunitha all set to enter into active politics. TDP president N Chandrababu Naidu also gave green signal to Paritala Sriram's political entry during his padayatra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X