వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంతోషాన్నిచ్చింది: చిరు, నో క్రికెట్ ఫుట్‌బాల్... విహెచ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi - V Hanumantha Rao
హైదరాబాద్: సామాజిక సేవ ఎంతో సంతృప్తినిస్తుందని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెసు ముఖ్య నేత చిరంజీవి శనివారం అన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వద్ద నిర్మించనున్న మున్నూరుకాపు నిత్యాన్నదాన సత్ర భవన బ్రోచర్‌ను ట్రస్టు సభ్యులు రవీంద్ర భారతిలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ తనకు సంతోషాన్ని కలిగించిన కొన్ని సందర్భాల్లో బ్రోచర్ విడుదల కార్యక్రమం ఒకటిగా నిలిచిపోతుందన్నారు.

ఎమ్మెల్సీ, పిసిసి మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాజకీయంగా నేతల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ కులపరంగా తమ ఐక్యతను ఎవ్వరూ వేరుచేయలేరన్నారు. సత్ర నిర్మాణం చేపట్టడం మంచి కార్యక్రమమని పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ అన్నారు. రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు మాట్లాడుతూ రాజకీయం అంటే ఫుట్‌బాల్ మ్యాచ్ లాంటిదని, బంతి దొరికినప్పుడే మరో ఆలోచన చేయకుండా గోల్ కొట్టెయ్యాలని అక్కడే ఉన్న చిరంజీవిని చూపిస్తూ.. అవకాశం వచ్చినప్పుడే ఉపయోగించుకో అని సూచించారు.

1992లో తనకు ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చినప్పుడు సరిగ్గా ఇదే జరిగిందని, మన వాల్లే అడ్డు చెప్పడంతో అందివచ్చిన అవకాశం చేజారిపోయిందన్నారు. సత్ర నిర్మాణం, నిర్వాహణకు తన వంతు సహాయం అందిస్తానని టిటిడి మాజీ చైర్మెన్ ఆదికేశవులు నాయుడు చెప్పారు. విశిష్ట అతిథిగా హాజరైన దేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రి సి రామచంద్రయ్య మాట్లాడుతూ సత్ర నిర్మాణానికి అవసరమైన సహాయ, సహకారాన్ని అందిస్తానని తెలిపారు.

మున్నూరుకాపు వారు పిసిసి అధ్యక్షులుగా ఉన్న మూడుసార్లు కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చారని రాజ్యజసభ మాజీ సభ్యుడు కె కేశవ రావు అన్నారు. కార్యక్రమ గౌరవాధ్యక్షుడు, సత్ర నిర్మాణానికి ముఖ్య కారకుడైన నేతి విద్యాసాగర్ మాట్లాడుతూ రానున్న కాలంలో ట్రస్టు తరపున మరిన్ని సామాజిక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. మంత్రి పొన్నాల లక్ష్మయ్య సత్ర విశేషాలతో రూపొందించిన వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొత్తపల్లి సుబ్బరాయుడు, సత్యనారాయణ, జోగు రామన్న, టిఆర్ఎస్ నేత ఆర్‌వి మహేందర్, నిజాం క్లబ్ అధ్యక్షుడు ఏనుగుల రాజేందర్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

English summary
Congress party leader and Rajyasabha Member Chiranjeevi said on Saturday in Munnuru Kapu brochure release that he is happy with release of brochure.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X