ఎప్పుడు ముగుస్తుందో...: జగన్ కేసుపై సిబిఐ డైరెక్టర్

YS Jagan
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు దర్యాప్తు ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేమని సిబిఐ డైరెక్టర్ అమర్ ప్రతాప్ సింగ్ అన్నారు. రెండు రోజుల పాటు సాగిని ఎసిబి, సిబిఐ అధిపతుల సమావేశం అనంతరం ఆయన గురువారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కోర్టు ఆదేశం మేరకు వైయస్ జగన్ ఆస్తుల కేసులో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నామని అన్నారు.

జగన్ కేసు దర్యాప్తు ఎప్పటికి పూర్తవుతుందనేది ఇప్పుడే చెప్పలేమని అన్నారు. ఈ కేసులో విదేశాల నుంచి తమకు సమాచారం రావాల్సి ఉందని, ఆ సమాచారమే కేసులో అత్యంత ప్రధానమైందని ఆయన అన్నారు. దర్యాప్తు పలు కోణాల్లో జరుగుతోందని చెప్పారు. ఓ కేసులో ఇలాంటి దర్యాప్తు సాగడం ఇదే ప్రథమమని ఆయన అన్నారు. కేసు దర్యాప్తును త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నామని, ఎంత త్వరగా పూర్తి చేస్తామనేది ఇప్పుడే చెప్పలేమని ఆయన అన్నారు.

ఇదిలావుంటే, బెయిల్ డీల్ కుంభకోణం కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను ఎసిబి శుక్రవారానికి వాయిదా వేసింది. సిబిఐ నమోదు చేసిన ఒఎంసి, ఎఎంసి కేసుల్లో జనార్దన్ రెడ్డిని బయటకు తీసుకురావడానికే మిగిలినవారంతా కుట్ర చేశారని ఎసిబి కోర్టుకు తెలిపింది. అందువల్ల గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ ఇవ్వరాదని కోరింది.

గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కుంభకోణం కేసులో నిందితుడైన మాజీ న్యాయమూర్తి టివీ చలపతిరావుకు గురువారం హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎసిబి కోర్టు బెయిల్ నిరాకరించడంతో చలలపతిరావు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు - లక్ష రూపాయల చొప్పున ఇద్దరి పూచీకత్తు సమర్పించాలని, పాస్‌పోర్టును ఎసిబి కోర్టులో డిపాజిట్ చేయాలని షరతులు పెట్టి బెయిల్ మంజూరు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+